Site icon NTV Telugu

Andhra Pradesh: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ

Transfers

Transfers

Andhra Pradesh: ఏపీలో పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు కేటాయిస్తూ, పలువురు ఐఏఎస్‌లను బదిలీలు చేస్తూ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా విజయసునీత.. గ్రామ, వార్డు, సచివాలయాల అడిషనల్‌ డైరెక్టర్‌‌గా భావన.. శ్రీకాకుళం జేసీగా నవీన్.. పార్వతీపురం ఐటీడీఏ పీవోగా విష్ణుచరణ్‌.. మిడ్‌ డే మీల్స్‌ డైరెక్టర్‌గా నిధి మీనా.. ఏపీ సీఆర్‌డీఏ అడిషనల్‌ కమిషనర్‌గా కట్టా సింహాచలం బదిలీ అయ్యారు.

Read Also: TDP Flag: మౌంట్ ఎవరెస్ట్ పై టీడీపీ జెండా ఎగరేసిన 80ఏళ్ల వృద్ధుడు

అటు 2020 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారులకు సబ్‌ కలెక్టర్లుగా పోస్టింగ్‌లు కేటాయించారు. తెనాలి సబ్‌ కలెక్టర్‌గా గీతాంజలి శర్మ.. రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌గా శుభం బన్సాల్‌.. నరసాపురం సబ్ కలెక్టర్‌గా సూర్య తేజ.. టెక్కలి సబ్ కలెక్టర్‌గా రాహుల్‌ కుమార్‌రెడ్డి.. పాలకొండ సబ్‌ కలెక్టర్‌గా నూర్‌ కౌమర్.. ఆదోని సబ్‌ కలెక్టర్‌గా అభిషేక్‌ కుమార్.. విజయవాడ సబ్‌ కలెక్టర్‌గా అదితి సింగ్‌.. పెనుకొండ సబ్‌ కలెక్టర్‌గా కార్తీక్‌.. గూడూరు సబ్‌ కలెక్టర్‌గా శోభికా.. కందూకూరు సబ్‌ కలెక్టర్‌గా మాధవన్.. పార్వతీపురం ఆర్డీవోగా హేమలతకు పోస్టింగ్ ఇచ్చినట్లు ఉత్తర్వుల్లో సీఎస్ సమీర్ శర్మ వెల్లడించారు.

Exit mobile version