ఏపీలో నిర్వహించిన 73వ రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ఓ ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఐఏఎస్ అధికారులతో సీఎం జగన్ ముచ్చటించారు.
Read Also: జిల్లాల పేర్లలో స్వల్ప మార్పులు… జిల్లాల విభజనపై పలుచోట్ల నిరసనలు
ఈ సందర్భంగా సీఎం జగన్ పిలవగానే వచ్చిన సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్.. మోకాళ్లపై కూర్చుని ఆయనతో మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ సంఘటనపై భిన్న రకాల స్పందన వినిపిస్తోంది. గతంలో తెలంగాణలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. అప్పుడు మాజీ కలెక్టర్ వెంకట్రామయ్య సీఎం కేసీఆర్ కాళ్లపై పడగా.. అది వివాదాస్పదమైంది. ఇప్పుడు ఏపీలో జరిగిన ఘటనపైనా విమర్శలు వినిపిస్తున్నాయి.
