NTV Telugu Site icon

Rapaka Varaprasad: వైరల్‌గా మారిన ఎమ్మెల్యే రాపాక వీడియో.. దొంగ ఓట్లతోనే గెలిచా..

Rapaka Varaprasad

Rapaka Varaprasad

Rapaka Varaprasad: రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. దీంతో.. మరోసారి వైరల్ గా మారిపోయింది రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యల వీడియో.. అయితే, గతంలో తాను సర్పంచ్ గా దొంగ ఓట్లుతో గెలిచానని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే రాపాక.. చింతలమోరి గ్రామంలో నా ఇంటి వద్ద పోలింగ్ బూత్‌లో దొంగ ఓట్లు పడేవన్నారు.. నా అనుచరులు ఒక్కొక్కరు పదేసి ఓట్లు వేసేసేవారు.. దీంతో, చింతలమోరి గ్రామంలో నాకు మెజారిటీ ఏడు నుంచి ఎనిమిది వందల వరకు వచ్చేదంటూ.. అదేదో గొప్ప కార్యం అయినట్టుగా చెప్పుకొచ్చారు.

Read Also: YS Viveka Murder Case: సీబీఐ తీరుపై సుప్రీం ఆగ్రహం.. కీలక ఆదేశాలు

కాగా, ఎమ్మెల్యే రాపాక వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారిపోయాయి.. గతంలో చింతలమూరి గ్రామ సర్పంచ్ గా పనిచేశారు రాపాక, నిన్నటికి నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి తనకు పది కోట్ల రూపాయల ఆఫర్‌ వచ్చిదంటూ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన వీడియో వైరల్‌గా మారగా.. మరోవైపు.. దొంగ ఓట్లతోనే తాను గెలిచానంటూ ఆయన పేర్కొన్న వీడియో సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తోంది. అయితే, ఇటీవల వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే రాపాక ఉత్సాహంతో మాట్లాడారు… అదే సమయంలో నోరుజారి తాను సర్పంచ్ గా దొంగ ఓట్లుతో గెలిచానని చెప్పుకొచ్చారు.. ఓవైపు టీడీపీపై చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతుండగా.. దీంతో అంతర్వేదిలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే రాపాక వ్యాఖ్యల వీడియోలను ఎవరో కావాలనే ఒక్కొక్కటిగా వైరల్ చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరు బయటపెట్టినా.. ఎవరు వైరల్‌ చేసినా.. ఎమ్మెల్యే రాపాక ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్‌ చేస్తున్నారు. కాగా, గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి విజయం సాధించిన ఆయన.. ఆ తర్వాత వైసీపీకి దగ్గరైన విషయం విదితమే.