Mobile Number: ఓ వివాహిత ప్రాణం తీసిన కొత్త నంబర్.. అసలేం జరిగిందంటే?

Husband Killed Wife Over Ne

Husband Killed Wife Over Ne

Mobile Number: ఆంధ్రప్రదేశ్‌లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్య ఫోన్‌కు కొత్త నంబర్ నుంచి ఫోన్ రావడంతో అనుమానం పెంచుకున్న భర్త.. ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఆపై పోలీసుల ముందు లొంగిపోయాడు. తిరుపతిలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. బ్రాహ్మణతాంగాళ్‌ పంచాయతీకి వెంకటేశ్ అలియాస్‌ పండు కై లాసనాథకోన అనే వ్యక్తి ఈశ్వరకాలనీకి చెందిన గాయత్రి(32)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Cinema At Manipur: మణిపూర్‌లో 23 ఏళ్ల తరువాత.. హిందీ సినిమా ప్రదర్శన

×
×
Ad

కాగా.. కొన్ని రోజుల క్రితం గాయత్రి చంద్రగిరిలో ఉంటున్న తన సోదరి రోజా ఇంటికి వెళ్లి వచ్చింది. అనంతరం రోజా ఒక కొత్త నంబర్ నుంచి తన అక్క గాయత్రికి ఫోన్ చేసి.. క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంది. అయితే.. గాయత్రి ఫోన్‌లో ఈ కొత్త నంబర్‌ని వెంకటేశ్ గమనించాడు. అతనికి అది రోజా నంబర్ అనే విషయం తెలీదు. దీంతో.. అతడు తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. మరెవరితోనో సన్నిహితంగా మెలుగుతోందని భావించాడు. ఆ అనుమానంతోనే గాయత్రిని వేధించడం మొదలుపెట్టాడు. రానురాను ఈ అనుమానం పెనుభూతంగా మారింది. దాంతో.. తన భార్యని అంతమొందించాలని వెంకటేశ్ నిర్ణయించుకున్నాడు.

Pawan Kalyan: మళ్లీ విశాఖకు పవన్‌కు.. నేడు ఎర్రమట్టి కొండల పరిశీలన

భర్త వేధింపులతో గాయత్రి తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఇదే అదునుగా భావించి.. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో గాయత్రి నిద్రపోతున్నప్పుడు, వెంకటేశ్ ఆమె తలపై బండరాయితో గట్టిగా బాదాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ నేరం చేసింది తనేనని పోలీసుల విచారణలో తేలిపోతుందని భావించి.. తానే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి వెంకటేశ్ లొంగిపోయాడు. అతడిచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, గాయత్రి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.