Tourist Rush in Araku Valley: అల్లూరి సీతారామరాజు జిల్లాలో టూరిజం జోష్ పీక్స్ కు చేరింది. ఇయర్ ఎండ్, హాలిడేస్ కలిసి రావడంతో ఎక్కడ చూసిన పర్యాటకుల సందడే కనిపిస్తోంది. దట్టమైన పొగమంచు అందాలను, లోయల సోయగాలను ఆస్వాదించడానికి ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి రెక్కలు కట్టుకుని వచ్చి మరీ వాలిపోతున్నారు. దీంతో అరకు పర్యాటకుల రద్దీతో కిక్కిరిసింది. ఘాట్ రోడ్లలో వాహనాల సంఖ్య పరిమితికి మించి వస్తున్నాయి. దీంతో విశాఖ , అరకు, పాడేరుల్లో హోటల్స్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
Read Also: Fact Check: రాఫెల్ ఒప్పందంపై భారత్ రహస్య లేఖ లీక్..? జోరుగా ప్రచారం చేస్తున్న పాకిస్థాన్
అయితే, రెండేళ్ల విరామం తర్వాత ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యాటకులు రద్దీ విపరీతంగా కొనసాగుతుంది. జనవరి 6వ తేదీ వరకు అన్ని రిజర్వేషన్లు ఫుల్ అయిపోయాయి. హోటల్స్, రిసార్ట్స్ దగ్గర డిమాండ్ ఆధారంగా ధరలు పెంచేసి టూరిస్టులను దోచుకుంటున్నారు. ఈ స్థాయిలో పర్యాటకులు అల్లూరి సీతారామరాజు జిల్లాకు పోటెత్తగా పర్యాటక కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. వాతావరణం అనుకూలించడం, వరుస సెలవులు రావడంతో స్నేహితులు, కుటుంబాలతో కలిసి ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాల సందర్శనకు అధిక సంఖ్యలో టూరిస్టులు విచ్చేస్తున్నారు. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు ఎక్కడ చూసిన సందడే సందడి. బొర్రా గుహలు, కటికి, తాడిగూడ జలపాతాలు, అరకు లోయ మండలంలో మడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియమ్, పద్మాపురం ఉద్యానవనం, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి గెడ్డ, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్, చెరువువేనం మేఘాలకొండ ప్రాంతాల్లో పర్యాటకులతో రద్దీ కొనసాగుతుంది.
Read Also: Hyderabad: బాగా చదువుకోవాలని తండ్రి మందలించడంతో.. పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
ఇక, ఆంధ్రా ఊటీ అరకు, వంజంగి మేఘాల పర్వత ప్రాంతాలు పర్యాటకులతో కళకళలాడుతున్నాయి. కొండ పైకి వెళ్లి ప్రకృతి అందాల మధ్య సూర్యోదయం ఆస్వాదించడానికి పోటీ పడుతున్నారు. టూరిస్టుల తాకిడికి సరిపడగా వసతి దొరక్కపోవడంతో వందలాది మంది పర్యాటకులు ప్రధాన రహదారులపై చలి మంటలు కాచుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరు టెంట్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన చాపరాయి జల విహారానీకి వేల సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. అలాగే, టూరిస్టులతో అరకు కిరండూల్ ప్యాసింజర్ రైలు కిటకిటలాడుతోంది. కనీసం నిలబడడానికి కూడా చోటు లేని పరిస్థితి నెలకొంది. సంక్రాంతి వరకు ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉండటంతో అరకుకు స్పెషల్ ట్రైన్ వెయ్యాలని టూరిస్టుల విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Also: Divorce Within 24 Hours: 3 ఏళ్లుగా లవ్.. పెళ్లైన 24 గంటలకే విడాకులు.. కారణం ఏంటంటే..?
కాగా, అరకు ఘాట్ రోడ్ లో ఎటు చూసిన వాహనాలు బారులు తీరడం కనిపిస్తుంది. కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురైతున్నాయి. దీంతో తక్షణ చర్యలను పోలీసులు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఉడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళల మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అరకు ఘాట్ రోడ్లు ఇటీవల బాగా ప్రాచిర్యంలోకి వచ్చిన ఉడెన్ బ్రిడ్జి సందర్శన వేళలను ఈరోజు నుంచి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు.
