Site icon NTV Telugu

Minister Anitha: ఓ మహిళ సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడకూడదు.. రోజాపై హోంమంత్రి ఫైర్

Anitha

Anitha

Minister Anitha: వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా మండిపడింది. సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడే వారి గురించి ఏం మాట్లాడుతామన్నారు. రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని, కానీ, కొందరు ప్రస్టేషన్ ని తట్టుకోలేక అసభ్యంగా మాట్లాడుతున్నారు.. ఆ మాటల వల్ల సానుభూతి వస్తుందని అనుకుంటున్నారు.. కానీ ప్రజలు మాత్రం వారిని అసహ్యించుకుంటారని హోంమంత్రి అనిత చెప్పుకొచ్చింది.

Read Also: Train Video: మొబైల్ దొంగిలించి కదులుతున్న రైలు నుంచి దూకేసిన దొంగ

ఇక, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్ మెన్ సస్పెండ్ వ్యవహారాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదని మంత్రి అనిత చెప్పుకొచ్చింది. గన్ మెన్ అనే వారిని వ్యక్తిగత భద్రత కోసం ఇస్తారు.. అలాంటి వారిని అటెండర్ లా వాడుకోవటాన్ని తప్పుపట్టారు‌‌‌‌‌. రేపు ఎవరైనా పెద్దిరెడ్డి మీదే దాడికి ప్రయత్నిస్తే గన్ మెన్ ఎలా కాపాడుతారని ప్రశ్నించింది. ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులు ఎవరికి తోత్తులుగా పని చేయాల్సిన అవసరం లేదని నిజాయితీ పని చేసుకోవచ్చని వెల్లడించింది. అయితే, రాష్ట్రం మీదా దుష్టశక్తులు కళ్ళు పడకుండా ఉండాలని ఆ దేవుడ్ని కోరుకున్నాను అని మంత్రి వంగలపూడి అనిత పేర్కొనింది.

Exit mobile version