వరద బాధితుల్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు హోంమంత్రి తానేటి వనిత. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం ముంపు గ్రామమైన యలమంచిలిలంకలో రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత ,ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ కౌరు శ్రీనివాసు లతో ఏటిగట్టు నుంచి ఊరు లోపలికి కొంత దూరం పడవ ప్రయాణించి బాధిత మహిళలతో మాట్లాడారు. ఇంకా 24 గంటల పాటు వరద పెరిగే సూచనలు ఉన్నాయని అంతా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని ముంపు గ్రామ ప్రజలను అభ్యర్థించారు. ఎట్టి పరిస్థితులు సంభవించిన వాటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు, వారికి కావలసిన నిత్యావసర మందులు భోజనం ఏర్పాట్లు సరిగా చూసుకోవాలని స్థానిక అధికారులను కోరారు
మరోవైపు ఆచంట మండలం భీమలాపురంలో వరద ఉధృతికి కొట్టుకునిపోయిన దేవి ముత్యాలమ్మ కుటుంబాన్ని పరామర్శించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ రంగనాథరాజు. ఏటి గట్టున అనుకుని ఉన్న 82 కుటుంబాలకు రెండు మరపడవలు, NDRF టీం,వీరి కోసం వివిధ శాఖలకు చెందిన 100 మంది ఉద్యోగస్తులను నియమించామని అన్నారు. ముంపు గురైన బాధితులను మూడు రోజుల నుండి పునరావాస కేంద్రాలకు తరలిరావాలని కోరినట్టు చెప్పారు. ముత్యాలమ్మ కుటుంబ సభ్యులు సహకరించి ఉంటే.. ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అధికారులకు సహకరించి పునరావాస కేంద్రాలకు తరలిరావాలని ఆయన కోరారు. బాధితులకు మెరుగైన ఆహార వసతులు కల్పించాం అన్నారు. విపత్తును ఎదుర్కునేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసామని .వరద ఉధృతి దృష్ట్యా అనుమతి లేనిదే ఎవరిని లోపలికి అనుమతించారని అధికారిపై మాజీ మంత్రి శ్రీ రంగనాథ రాజు మండిపడ్డారు.
ఆచంట మండలం కోడేరులో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ, కలెక్టర్ పి. ప్రశాంతి పర్యటించారు. వరద బాధితులకు ప్రభుత్వం నుండి అందుతున్న సహాయ సహకారాలు గురించి అధికారులును అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం మీడియా తో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఆచంట మండలం లంక గ్రామాల్లో వరద ముంపు గురైన కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, పాలు, బియ్యం,మంచి నీరు ఎప్పటికప్పుడు లంక వాసులు ఇబ్బంది పడకుండా అందిస్తున్నాం అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో లంక గ్రామాల నుండి ప్రజలను తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్, పోలీస్ బృందాలు ఏర్పాటు చేశాం. భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం పట్టడంతో మనకు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.
Montana Pileup: ధూళి తుపాను కారణంగా 21 వాహనాలు ఢీ.. ఆరుగురు మృతి