తిరుమల శేషాచల కొండల్లో గుప్త నిధుల కోసం భారీ తవ్వకాలు జరిపారు. దాంతో తాజాగా 80 అడుగుల సొరంగం వెలుగు చూసింది. కొండను తవ్వి మరీ సొరంగం ఏర్పాటు చేసారు. ఈ ఘటనలోపోలీసుల అదుపులో నిందితుడు మంకు నాయుడు, మరో ఆరుగురు కూలీలు ఉన్నారు. కొండల్లో గుప్త నిధులు ఉన్నాయని ఓ స్వామిజీ చెప్పడంతో సోరంగం తవ్వినట్లు ఒప్పుకున్నాడు నిందితుడు మంకు నాయుడు. నిందితుడి సాయంతో సొరంగంను తనిఖీ చేసిన పోలీసులు.. కొండలోపల 80 అడుగుల భారీ సొరంగాన్ని చూసి అవాక్కయారు. ఏడాది కాలంగా రహస్యంగా సాగుతుంది సొరంగ తవ్వకం. నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు పోలీసులు. అయితే పోలీసులు, అటవీ అధికారులు, టీటీడీ విజిలెన్స్ కన్నుగప్పి ఇంతటి భారీ సొరంగం ఎలా తవ్వారన్న అంశం ప్రశ్నగా మారింది