Site icon NTV Telugu

ఏపీ సర్కార్‌కు హీరో సిద్దార్థ్‌ కౌంటర్‌

సినిమా హాళ్లు బతకడానికి అవకాశం ఇవ్వాలని హీరో సిద్ధార్థ్‌ ట్విట్టర్‌ వేదికగా కోరారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం పై సెటైర్లు వేశారు. టికెట్‌ రేట్స్‌ గురించి పలు ట్వీట్లు చేశాడు. ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించే ఈ ట్వీట్లు చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ మీరు ఓ ప్లేట్‌ ఇడ్లీ లేదా కాఫీ ఎంతకు అమ్మాలో ఏసీ రెస్టారెంట్లకు చెప్పరు. కానీ, సినిమా పరిశ్రమను మాత్రం ఎందుకు సమస్యగా చూస్తారన్నారు.

ఇటీవల ఏపీ ప్రభుత్వం టికెట్‌ రేట్లకు సంబంధించి ఓ జీవోను విడుదల చేసింది. అందులో గ్రామీణ ప్రాంతాల్లో థియేటర్లలో రేటు ఐదు రూపాయలు కూడా ఉంది. సింగిల్‌ టీ కూడా అంతకంటే ఎక్కువ రేటు ఉన్నప్పుడు సినిమా టికెట్‌ అంతకు తక్కువకు అమ్మితే నిర్మాతలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు.

ఈ హీరో ట్వీట్లతోనే ఆగిపోలేదు. చట్టాల గురించి కూడా ప్రస్తావిస్తూ రోజుకు ఎన్ని షోలు వేయాలి?టికెట్‌ రేటు ఎంతకు ఉండాలి? అనే విషయంలో పరిమితులు విధించడం(mrtp) చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్నారు. ఓ ప్రాంతంలో రెంట్స్‌ ఎలా ఉన్నాయో తెలుసుకుని ఏవరేజ్‌రెంట్‌ క్యాలిక్యూలేట్‌ చేసి టికెట్‌ రేట్స్‌ నిర్ణయించమని ప్రభుత్వాలకు ఆయన సలహా ఇచ్చారు.

సినిమా కంటే లిక్కర్‌, పొగాకుకు ఎక్కువ గౌరవం ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు.#save cinema అంటూప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మా వ్యాపారం ఎలా చేయాలో మాకు చెప్పొద్దు. మాకు పన్నులు విధించండి. సినిమాలు సెన్సార్‌ చేయండి. మీరు ఎప్పుడు చేసినట్టుగానే ఇల్లీగల్‌గా నిర్మాతలను, సినిమా పరిశ్రమపై ఆధారపడి బతికే వాళ్లను వాళ్ల జీవితాల నుంచి గెంటేయకండి. ఎవరూ సినిమా చూడమని ఫోర్స్‌ చేయరు.

సినిమా బడ్జెట్‌, స్కేల్‌ను ప్రేక్షకుడు నిర్ణయించలేడు. దానిని క్రియేటర్‌, ఇన్వెస్టర్‌ నిర్ణయిస్తాడు. సినిమా నుంచి ఎంత సంపాదించాలనే అధికారం ఎవరికీ లేదు. పేదరికం నుంచి వచ్చి లక్షాధికారులుగా ఎదిగిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలను ఎవరైనా ప్రశ్నిస్తారా? సినిమా ఇండస్ట్రీని అంచనా వేయడం ఇకనైనా ఆపండి అంటూ ట్వీట్స్‌ చేశాడు సిద్ధార్థ్‌.

https://twitter.com/Actor_Siddharth/status/1466393957621923853?s=20
https://twitter.com/Actor_Siddharth/status/1466393964961927175?s=20
https://twitter.com/Actor_Siddharth/status/1466393954769784836?s=20
Exit mobile version