ఏపీ సర్కార్‌కు హీరో సిద్దార్థ్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా హాళ్లు బతకడానికి అవకాశం ఇవ్వాలని హీరో సిద్ధార్థ్ ట్విట్టర్ వేదికగా కోరారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం పై సెటైర్లు వేశారు. టికెట్ రేట్స్ గురించి పలు ట్వీట్లు చేశాడు. ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించే ఈ ట్వీట్లు చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ మీరు ఓ ప్లేట్ ఇడ్లీ లేదా కాఫీ ఎంతకు అమ్మాలో ఏసీ రెస్టారెంట్లకు చెప్పరు. కానీ, సినిమా పరిశ్రమను మాత్రం ఎందుకు సమస్యగా చూస్తారన్నారు.
ఇటీవల ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లకు సంబంధించి ఓ జీవోను విడుదల చేసింది. అందులో గ్రామీణ ప్రాంతాల్లో థియేటర్లలో రేటు ఐదు రూపాయలు కూడా ఉంది. సింగిల్ టీ కూడా అంతకంటే ఎక్కువ రేటు ఉన్నప్పుడు సినిమా టికెట్ అంతకు తక్కువకు అమ్మితే నిర్మాతలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు.
Also Read
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ఈ హీరో ట్వీట్లతోనే ఆగిపోలేదు. చట్టాల గురించి కూడా ప్రస్తావిస్తూ రోజుకు ఎన్ని షోలు వేయాలి?టికెట్ రేటు ఎంతకు ఉండాలి? అనే విషయంలో పరిమితులు విధించడం(mrtp) చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్నారు. ఓ ప్రాంతంలో రెంట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుని ఏవరేజ్రెంట్ క్యాలిక్యూలేట్ చేసి టికెట్ రేట్స్ నిర్ణయించమని ప్రభుత్వాలకు ఆయన సలహా ఇచ్చారు.
సినిమా కంటే లిక్కర్, పొగాకుకు ఎక్కువ గౌరవం ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు.#save cinema అంటూప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మా వ్యాపారం ఎలా చేయాలో మాకు చెప్పొద్దు. మాకు పన్నులు విధించండి. సినిమాలు సెన్సార్ చేయండి. మీరు ఎప్పుడు చేసినట్టుగానే ఇల్లీగల్‌గా నిర్మాతలను, సినిమా పరిశ్రమపై ఆధారపడి బతికే వాళ్లను వాళ్ల జీవితాల నుంచి గెంటేయకండి. ఎవరూ సినిమా చూడమని ఫోర్స్ చేయరు.
సినిమా బడ్జెట్, స్కేల్‌ను ప్రేక్షకుడు నిర్ణయించలేడు. దానిని క్రియేటర్, ఇన్వెస్టర్ నిర్ణయిస్తాడు. సినిమా నుంచి ఎంత సంపాదించాలనే అధికారం ఎవరికీ లేదు. పేదరికం నుంచి వచ్చి లక్షాధికారులుగా ఎదిగిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలను ఎవరైనా ప్రశ్నిస్తారా? సినిమా ఇండస్ట్రీని అంచనా వేయడం ఇకనైనా ఆపండి అంటూ ట్వీట్స్ చేశాడు సిద్ధార్థ్.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!