Chandrababu On Rains: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలను వరద నీరు ముంచెత్తింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఏపీ విపత్తు నిర్వహణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఇక, ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. భారీ వర్షాల వల్ల రాష్ట్రం అతలాకుతలమైంది.. కొన్ని చోట్ల ఎప్పుడూ పడనంత వర్షం పడింది.. 14 నియోజకవర్గాల్లో 20 సెంటి మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది అని ఆయన తెలిపారు. వత్సవాయి, జగ్గయ్యపేట వంటి ప్రాంతాల్లో 30 శాతం వర్షపాతం నమోదైంది.. జాతీయ రహాదారులు స్థంభించిపోయాయి.. రోడ్ల మీదకు నీరొచ్చేసింది.. నాలుగు సార్లు టెలీకాన్ఫరెన్సులు నిర్వహించా.. ప్రభుత్వం రెగ్యులర్ మానిటరింగ్ చేయడం వల్ల ప్రాణ నష్టం తక్కువగా ఉంది.. కానీ 9 మరణాలు సంభవించాయి.. దురదృష్టకరం అని సీఎం చంద్రబాబు అన్నారు.
Read Also: Vande Bharat Sleeper: అదిరిపోయే “వందే భారత్ స్లీపర్ ట్రైన్” ఫీచర్లు.. మీరు ఓ లుక్కేయండి..
ఇక, రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నీటితో నిండిపోయాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 1-2 లక్షల క్యూసెక్కుల నీరు వాగుల్లో ద్వారా వచ్చే ప్రమాదముంది.. ప్రకాశం బ్యారేజీకి వరద పొటెత్తుతోంది.. రేపటికల్లా ప్రకాశం బ్యారేజీకి 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే సూచనలున్నాయి.. దిగువ ప్రాంతాల్లో సహయక చర్యలు తీసుకుంటున్నాం.. బండ్స్ పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బుడమేరుకు పెద్ధ ఎత్తున వరద వస్తోంది.. 1.50 లక్షల హెక్టార్లల్లో వరి పంట, ఉద్యాన పంటలూ నష్టపోయాయని ఆయన అన్నారు. ఇప్పటికే 17 వేల మందిని క్యాంపుల్లోకి తరలించాం.. 8 బూట్లు, రెండు ఛాపర్లు అత్యవసర పరిస్థితుల కోసం సిద్దంగా ఉంచాం.. రెస్క్యూ చేయగలిగామన్నారు. అలాగే, 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు ఒక్కొక్క కిలో చొప్పున బాధితులకు ఇస్తున్నామని పేర్కొన్నారు. మత్స్యకారులు, చేనేతలకు అదనంగా 50 కేజీల బియ్యం ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.