NTV Telugu Site icon

Srisailam: శ్రీశైలం డ్యామ్‌కు భారీగా వరద.. గేట్లు ఎత్తేది ఎప్పుడు..?

Srisailam

Srisailam

భారీ వర్షాలకు తోడు, ఎగువ నుంచి వస్తున్న వరదలతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారుతున్నాయి.. గోదావరి బేసిన్‌తో పోలీస్తే మాత్రం.. కృష్ణా బేసిన్‌లో వరద ప్రవాహం కాస్త ఆలస్యంగానే ప్రారంభం అయ్యిందని చెప్పుకోవాలి.. ఇప్పుడిప్పుడే కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది.. కృష్ణా బేసిన్‌లోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది.. దీంతో, 18 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇన్ ఫ్లో రూపంలో లక్షా 6 వేల క్యూసెక్కుల నీరు వచ్చి ప్రాజెక్టులో చేరుతుండగా.. లక్షా 7 వేల క్యూసెక్కుల నీటిని 18 గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు.. పూర్తిస్థాయి నీటిమట్టం 1,045 ఫీట్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1,039.50 ఫీట్లుగా ఉంది.. పూర్తి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు అయితే,, ప్రస్తుత నీటి నిల్వ 6.462 టీఎంసీలుగా ఉందని.. 3 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా.. ఎత్తి పోతల పథకాలకు కూడా నీటి విడుదల జరుగుతోంది..

Read Also: Astrology: జులై 14, గురువారం దినఫలాలు

ఇక, జూరాల నుంచి భారీ స్థాయిలో నీటి విడుదలతో.. శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద పోటెత్తుతోంది.. ఇన్ ఫ్లోగా 1,03,247 క్యూసెక్కుల నీరు వచ్చి శ్రీశైలం డ్యామ్‌ను చేరుతోంది.. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 827.80 అడుగుల నీటి మట్టం మాత్రమే ఉంది.. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 47.3680 టీఎంసీలుగా ఉంది.. అయితే, శ్రీశైలం డ్యామ్‌ నిండడానికి మరింత సమయం పట్టనుంది.. ప్రస్తుతం 827 అగుల నీటిమట్టం మాత్రమే ఉంది.. పూర్తిస్థాయిలో డ్యామ్‌ నిండాలంటే 885 అడుగులకు చేరాలి.. దీంతో, ఇప్పట్లో గేట్లు ఎత్తే పరిస్థితి మాత్రం లేదు.. కృష్ణమ్మ మరింతగా పరవళ్లు తొక్కితేగాని శ్రీశైలంలో గేట్లు ఎత్తే అవకాశం లేదు.. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో.. శ్రీశైలంలో గేట్లు ఎప్పుడు ఎత్తుతారు అని పర్యాటకులు ఎదురుచూస్తూ ఉంటారు.. గేట్లు ఎత్తినప్పుడు.. అక్కడ ఉండే వాతావరణాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఇతర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు తరలిరావడం తెలిసిన విషయమే..