Site icon NTV Telugu

AP: అతి పెద్ద హవాలా రాకెట్ గుట్టు రట్టు..!

ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద హవాలా రాకెట్ గుట్టు రట్టు అయ్యింది… బంగారం స్మగ్లింగ్, జీఎస్టీ ఎగవేతే లక్ష్యంగా హవాలా లావాదేవీలు జరుగుతున్నట్టు చెబుతున్నారు అధికారులు.. ట్రావెల్స్ బస్సుల ద్వారా హవాలా సొమ్ము, బంగారం రవాణా చేస్తున్నారు.. ఇవాళ ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్వహించిన తనిఖీల్లో బయటపడ్డ సొమ్ముతో అధికారులు నోరు వెల్లబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.. తూర్పు గోదావరి జిల్లా కృష్ణవరం టోల్‌ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు పట్టబడటం కలకలం సృష్టించింది. ట్రావెల్స్‌ బస్సుల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.5.6 కోట్ల నగదు, 10 కేజీల బంగారాన్ని సీజ్‌ చేశారు పోలీసులు..

Read Also: Ambati Rambabu: పవర్ స్టార్ పవర్ చూపించడే..? లోకేష్‌ నోరు విప్పడే..?

ఇక, పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్‌ ప్లాజా వద్ద ప్రైవేట్‌ బస్సులో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.4.76 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.. మొత్తంగా మూడు బస్సులను సీజ్ చేశారు ఉభయ గోదావరి జిల్లా పోలీసులు… హవాలా లావాదేవీలకు పద్మావతి ట్రావెల్స్ బస్సులను అక్రమార్కులు వినియోగించుకుంటున్నట్టుగా చెబుతున్నారు.. ఉత్తరాంధ్ర, బెజవాడ, గుంటూరు జిల్లాలకు చెందిన బంగారం వర్తకుల మధ్య హవాలా లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు.. విజయవాడలోని పద్మావతి ట్రావెల్స్ కార్యాలయానికి వెళ్లిన పోలీసులు.. వివరాలు సేకరించారు.. రెండు వైపులా నుంచి ఎవరెవరు ఈ పార్శిళ్లను బుక్ చేశారని ఆరా తీశారు.

Exit mobile version