Site icon NTV Telugu

దళితులకు జగన్‌ సర్కార్‌ అన్యాయం చేస్తుంది: హర్షకుమార్‌

దళితులకు జగన్‌ సర్కార్‌ అన్యాయం చేస్తుందని అమలాపురం మాజీ ఎంపీ జి.వి హర్షకుమార్‌ అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రేమ వివాహాల కేసుల్లో దళితులకు న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు. జగన్‌ చెల్లెలు కులాంతర వివాహాం చేసుకున్న ఫర్వాలేదు. కానీ ఇతరులు చేసుకుంటే కక్ష ఎందుకని ఆయన ప్రశ్నించారు.

కులాంతర వివాహాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వడం నిలిపివేసిందని హర్షకుమార్‌ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ప్రభుత్వం నాన్చుడి ధోరణి అవలంభిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికీ విద్య కోసం కృషి చేస్తున్నామని చెబుతున్నా ప్రభుత్వం ఇంతవరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వ లేదన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ .. దీక్ష విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద చేస్తే బాగుంటుందని హితవు పలికారు. జనసేన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై దశల వారి ఉద్యమం చేపట్టాలని హర్షకుమార్‌ పవన్‌కు సూచించారు.

Exit mobile version