Harsh Kumar: కాంగ్రెస్ పార్టీ కీలక పదవి.. తిరస్కరించిన హర్షకుమార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కీలకమార్పులు చేసింది అధిష్టానం.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌గా గిడుగు రుద్రరాజుని నియమించింది అధిష్టానం.. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలి, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, పి. రాకేశ్ రెడ్డిని.. ఏఐసీసీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్‌గా ఎంఎం పళ్లంరాజును.. క్యాంపెయిన్ కమిటీ చైర్మన్‌గా జీవీ హర్షకుమార్‌ను నియమించారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. అయితే, ఏఐసీసీ ఇచ్చిన పదవిని తిరస్కరించారు మాజీ ఎంపీ హర్షకుమార్.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఈ-మెయిల్ ద్వారా తిరస్కరణ లేఖ పంపారు హర్షకుమార్.
Read Also: Avanthi Srinivas: మాజీ మంత్రి అవంతికి షాకిచ్చిన జగన్.. అదికూడా పాయే..!
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ గా హర్షకుమార్‌ను బుధవారం రోజు నియమించారు జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. అయితే, వెంటనే ఆ పదవిని తిరస్కరించారు హర్షకుమార్.. తాను కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగానే కొనసాగుతానని పేర్కొన్నారు.. ఇదే సమయంలో.. కీలక ప్రస్తావన తీసుకొచ్చారు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అన్ని రాజకీయపార్టీల అధ్యక్షులు అగ్ర కులాల వారేనని పేర్కొన్నారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ-రెడ్డి, తెలుగుదేశం పార్టీ-కమ్మ, జనసేన పార్టీ-కమ్మ, బీజేపీ-కాపు, సీపీఎం-రెడ్డి, సీపీఐ-బీసీ ఉన్నారని.. ఇప్పుడు కాంగ్రెస్ ఏపీ అధ్యక్ష పదవిని బ్రాహ్మణ వర్గానికి కట్టబెట్టిందని ఏఐసీసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు హర్షకుమార్. దీంతో.. ఆయన కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్ష పదవి ఆశించారా? అనే చర్చ సాగుతోంది..
కాగా, పీసీసీ నూతన అధ్యక్షుడిగా గిడుగు రుద్ర రాజు నియామకంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.. కేక్ కట్ చేశారు నూతన అధ్యక్షుడు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్.. టీడీపీ, వైసీపీ, జనసేన.. అన్నీ బీజేపీ గొడుగు కింద ఉన్న పార్టీలని ఆరోపించారు.. ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల జరుగుతున్న నష్టంపై క్షేత్ర స్థాయికి తీసుకుని వెళ్తామన్నారు.. విభజన హామీల అమలు, రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని.. రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రజల్లోకి బలంగా వెళ్లిందని తెలిపారు గిడుగు రుద్రరాజు. మరి ఇప్పుడు హర్షకుమార్ లేఖపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!