కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు జోడించడంపై పెద్ద రచ్చే జరుగుతోంది.. ఇది అమలాపురంలో విధ్వంసానికి దారి తీసింది.. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లకు నిప్పుపెట్టేవరకు వెళ్లింది.. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. వైసీపీకి అంబేద్కర్ పట్ల ప్రేమ ఉంటే నవరత్నాలకు అంబేద్కర్ పేరు పెట్టొచ్చుగా..? అని ప్రశ్నించారు. అంబేద్కర్ దేశానికి దైవం.. కోనసీమలో హింసను ఖండిస్తున్నామన్న ఆయన.. కోనసీమ ఆందోళనల్లో బీజేపీ నేతలెవ్వరూ పాల్గొనలేదన్నారు. అంబేద్కర్ పేరును ఈ ప్రభుత్వం రాజకీయ వివాదంలోకి లాగిందని.. దేశ, రాష్ట్ర ప్రజలకు జగన్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also: Amalapuram: కోనసీమ టెన్షన్..! రోడ్లపైకి వస్తే కేసులు.. పోలీసుల వార్నింగ్
అంబేద్కర్‌ను అపఖ్యాతి పాల్జేసిన అప్రతిష్టని వైసీపీ మూట గట్టుకుందన్నారు జీవీఎల్.. ఏపీలో శాంతి భద్రతల వైఫల్యం కొట్టొచ్చినట్టు కన్పిస్తోందన్న ఆయన… ఏపీలో అడ్డగోలు వ్యవహారాలు, అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. ఇదే సమయంలో.. గుంటూరులోని జిన్నా టవర్స్ వ్యవహారాన్ని లేవనెత్తారు జీవీఎల్.. జిన్నా టవర్స్ పేరు మార్చమని డిమాండ్ చేస్తే మా అగ్ర నేతలను అరెస్టులు చేశారని ఫైర్ అయ్యారు. ఏపీ ప్రభుత్వానికి జిన్నాపై ఎందుకింత భక్తి..? ఎందుకు అంత మమకారం? అని ప్రశ్నించారు. జిన్నా టవర్స్ చాలా కాలంగా ఉంది నిజమే.. కానీ, ఇంకా జిన్నా పేరునే ఎందుకు కొనసాగించాలి..? అని నిలదీశారు. పాకిస్తాన్ జాతి పితకు గుంటూరుతో ఏం సంబంధం..? అని ప్రశ్నించిన ఆయన.. హిందూ వ్యతిరేక విధానాలతో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్ఆరు. హిందూ వ్యతిరేక విధానాలను ఈ ప్రభుత్వం వీడకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు జీవీఎల్ నరసింహారావు.