NTV Telugu Site icon

GVL Narasimha Rao: కొడాలి నానిపై జీవీఎల్ పరోక్ష కామెంట్లు.. నోరు అదుపులో పెట్టుకోవాలి

Gvl On Kodali

Gvl On Kodali

GVL Narasimha Rao Comments On Kodali Nani: ఏపీ మాజీ మంత్రి కొడాలి నానిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలని, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సహించమని హెచ్చరించారు. వైసీపీ అవినీతిపై ఛార్జిషీటు, మోడీ పాలనలో జరిగిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఎజెండాగా చర్చ జరిగిందని స్పష్టం చేశారు. పొత్తుల అంశం తాము చర్చించలేదని క్లారిటీ ఇచ్చారు. మిత్రపక్షమైన జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఎలా‌ వెళ్లాలనేది తమ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మిత్రపక్షంగా పవన్ కళ్యాణ్ చేసిన సూచనలు జాతీయ నాయకత్వం ఆలోచన చేస్తుందన్నారు.

ఒక్క సినిమా.. 550 సార్లు రీరిలీజ్.. హీరో ఎవరో తెలుసా..?

జగన్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని.. రాష్ట్ర ప్రభుత్వం అవినీతి, అరాచకాలతో మునిగి తేలుతోందని జీవీఎల్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, దోపిడీ, జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడుతుందని అన్నారు. మోడీ తొమ్మిదేళ్ల ప్రగతి పాలనను ప్రజలకు వివరిస్తూ.. నెల రోజులపాటు కార్యక్రమాలు చేపడతామన్నారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, నాయకులపై ప్రజాభిప్రాయ సేకరణ చేశామన్నారు. వైసీపీ వైఫల్యాలను ఎత్తి‌చూపుతూ అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. వైసీపీ పాలనపై బీజేపీ రాజకీయ యుద్ధం చేసేందుకు సన్నద్ధమవుతోందన్నారు. 145 నియోజకవర్గాల్లో తమ ఛార్జిషీటు రూపొందించామన్నారు. నెల్లూరు జిల్లాలో డిఎస్పీ తీరు దారుణమని మండిపడ్డారు. వైసీపీ నేతలపై పోలీసుల దాష్టికాన్ని అమిత్‌షాకు వివరిస్తామన్నారు. అమానుషంగా వ్యవహరించిన డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Sajjala : ఎంపీ అవినాష్ రెడ్డిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు..

Show comments