NTV Telugu Site icon

YS Jagan Visit Sahana Family: సహన కుటుంబానికి జగన్ పరామర్శ.. ప్రభుత్వంపై ఫైర్‌.. వైసీపీ నుంచి పరిహారం ప్రకటన..

Jagan

Jagan

YS Jagan Visit Sahana Family: గుంటూరు ప్రభుత్వ హాస్పటల్‌లో సహన కుటుంబ సభ్యులను పరామర్శించారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి.. అయితే, జగన్ చూసేందుకు భారీగా వైసీపీ కార్యకర్తలు రావడంతో తోపులాట జరిగింది.. ఇక, ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్‌.. కూటమి ప్రభుత్వంలో అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో నా దళిత చెల్లి మరణం చూస్తే అర్ధం అవుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో దిశ చట్టం రక్షణగా ఉండేది.. ఫోన్ కదిపితే పోలీసులు రక్షణగా ఉండేవారు.. కానీ, రాష్ట్రంలో ఇప్పుడు అధ్వాన్న పరిస్థితి ఏర్పడింది.. తప్పు చేసిన వాళ్లు.. వాళ్ల వాళ్లు అయితే చాలు ప్రభుత్వం నిందితులకు రక్షణగా ఉంటుందని దుయ్యబట్టారు.. నిందితుడు నవీన్ టీడీపీకి చెందిన వాడు… పని చేస్తున్న సహన ను కారు ఎక్కించుకుని వెళ్లి దారుణంగా హత్య చేశారు.. నవీన్ ఒక్కడే కాదు ఇంకొందరు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు.. సహనను శారీరకంగా, లైంగికగా వేధించారు.. తీవ్ర దాడి చేసి నిందితులు హాస్పిటల్లో వదిలేసి వెళ్లి పోయారు.. కానీ, తప్పు చేసిన వాళ్లను ప్రభుత్వం ఉపేక్షిస్తుందని మండిపడ్డారు..

Read Also: Ananya : క్యాస్టింగ్ కౌచ్ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన అనన్య నాగళ్ల

ఒక మహిళను బ్రెయిన్ డెడ్ అయ్యేదాకా దాడి చేసినా ఎందుకు ప్రభుత్వం స్పందించలేదు ? అని నిలదీశారు వైఎస్‌ జగన్.. బాధితులకు అండగా ఎందుకు ఈ ప్రభుత్వం నిలబడలేదు..? అని ప్రశ్నించారు. అయితే, టీడీపీకి చెందిన వ్యక్తి కాబట్టే నిందితున్ని ప్రభుత్వం కాపాడుతుందన్న ఆయన.. నేను వస్తున్నాను అని తెలిశాక టీడీపీ నాయకులు వచ్చారు అని దుయ్యబట్టారు.. తెనాలి ఎమ్మెల్యే.. మంత్రిగా ఉన్నారు.. కనీసం స్పందించలేదన్న ఆయన.. నిస్సిగ్గుగా నిందితుడు ని కాపాడుతున్నారు అంటూ ఫైర్‌ అయ్యారు.. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి.. బద్వేలులో కూడా ఇలాగే ఓ యువతిని అత్యాచారం చేసి తగల పెట్టేసారు.. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఇద్దరు బాలికలకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసారు.. ఆ దారుణం చేసింది కూడా టీడీపీ వాళ్లే అని ఆరోపించారు జగన్..

Read Also: Bigg Boss 8 Telugu: ఎంతపని చేస్తివి యష్మి.. వారి ప్రేమకు ఎండ్ కార్డు వేసావుగా

పిఠాపురంలో టీడీపీ నాయకుడు, టీడీపీ కార్పొరేటర్ భర్త.. పదహారేళ్ల యువతికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు.. అధికారం ఉందని ఈ దుర్మార్గాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు జగన్.. ప్రభుత్వం ఈ తప్పులు ఒప్పుకోవాలి.. బాధితులకు క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్‌ చేశారు.. డిప్యూటీ సీఎం సొంత నియోజకర్గంలో ఈ దారుణం జరిగితే.. పవన్‌ కల్యాణ్‌ ఏం చేస్తున్నారు..? కనీసం బాధితులకు అండగా నిలబడలేరా..? హిందూపూర్ లో దసరా పండుగ రోజు అత్త కోడళ్లపై అత్యాచారం చేశారు.. ఎమ్మెల్యే బాలకృష్ణ బాధితులకు కనీసం అండగా నిలబడలేదు ని మండిపడ్డారు.. ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా.. నాలుగు నెలల కాలం లో 77 మంది మహిళలపై అత్యాచారాలు, ఏడుగురు హత్యకు గురయ్యారు.. మీరు ఏం చేస్తున్నారు..? అని ప్రశ్నించారు..

Read Also: Yadadri Temple: భక్తులకు అలర్ట్‌.. యాదాద్రిలో ఇక నుంచి అలా చేయడం నిషేధం..

రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన జరుగుతుంది.. వైసీపీ పాలనలో దిశ అండగా ఉండేది అన్నారు జగన్.. ఆపదలో ఉంటే ప్రతి అక్క చెల్లెమ్మకు అండగా ప్రభుత్వం ఉండేది… ముప్పై ఒక్క వేల మంది మహిళలను దిశ యాప్ ద్వారా కాపాడాం అన్నారు.. దిశా యాప్ ను, దిశా చట్టాన్ని టీడీపీ ఎందుకు పక్కన పెట్టింది..? అని నిలదీశారు.. ఇక, నారా లోకేష్, హోం మంత్రి అనిత కలసి దిశా చట్టాన్ని కాల్చేశారు… అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తల్లులకు, పిల్లలకు పంగనామాలు పెట్టాడు.. పొడుపు సంఘాలకు డబ్బులు ఇవ్వడం లేదు.. అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు.. సీఎం చంద్రబాబు మహిళా లోకానికి క్షమాపన చెప్పాలి.. లేదంటే చరిత్ర హీనుడుగా మిగిలి పోతారని వ్యాఖ్యానించారు.. వైసీపీ తరఫున బాధితులకు పది లక్షల నష్ట పరిహారం ఇస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌..