Nadendla Manohar: గుంటూరు జిల్లా తెనాలిలోని జనసేన కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.. జనసేన పార్టీ కార్యాలయంలో భోగి మంటలను వెలిగించారు మంత్రి నాదెండ్ల మనోహర్.. భోగి వేడుకల్లో వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం ఆనందంతో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం.. గత నాలుగైదు సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న రైతాంగానికి కూటమి ప్రభుత్వం అండగా నిలబడిందన్నారు.. గత ప్రభుత్వం రైతులకు బకాయి పెట్టిన 1674 కోట్ల బకాయిలను కోటం ప్రభుత్వం రాగానే వారి ఖాతాలో జమ చేశాము.. రైతులు వద్ద ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపే వారి ఖాతాల్లో నగదు జమ చెయ్యటం ద్వారా ముందుగానే సంక్రాంతి వచ్చిందని భావన రైతులు వ్యక్తం చేశారని తెలిపారు.
Read Also: Sai Pallavi: ఆ స్టార్ హీరోని రిజెక్ట్ చేసిన సాయి పల్లవి
కూటమి ప్రభుత్వం రైతుల పట్ల అద్భుతంగా పనిచేసినందుకు గర్వపడుతున్నాం అన్నారు మంత్రి మనోహర్.. 6830 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేయటమే కాక 94 శాతం రైతుల ఖాతాల్లో నగదు చెల్లించాం అన్నారు.. గుంటూరు జిల్లాలో గత ప్రభుత్వం కేవలం 4000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే కూటమి ప్రభుత్వం సుమారు 70 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామన్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. పట్టుదలతో రాబోయే ఐదేళ్లలో రైతాంగం అద్భుతంగా ఉంటారని.. వారికి అండగా నిలబడతామన్నారు.. ఇక, పార్టీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు మిత్రులు, వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధితో ముందుకు వెళ్తుందని వెల్లడించారు మంత్రి నాదెండ్ల మనోహర్..