Muppavarapu Venkaiah Naidu: మాతృ భాషను మర్చిపోయిన వాడు మనిషి కాదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తత్వవేత్త కొత్త సచ్చిదానందమూర్తి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేను తెలుగులోనే మాట్లాడతానని స్పష్టం చేశారు.. తెలుగు వచ్చిన వాళ్ల ముందు ఇంగ్లీషులో మాట్లాడటం ఎందుకో నాకు అర్ధం కాదన్నారు.. మాతృ భాషను మర్చిపోయిన వాడు మనిషి కాదు అని హెచ్చరించారు.. కోట్లాది జీవరాశులలో చైతన్య వంతమైన జీవరాశి, మానవ జాతి ది.. కొత్త సచ్చిదానంద మూర్తి సమాజంలో చైతన్యం తీసుకువచ్చిన వ్యక్తి అని కొనియాడారు.. ఆంగ్లంలో మాట్లాడే నాయకులు గొప్పవాళ్లు కాదు.. మన దేశ నాయకులు చత్రపతి శివాజీ, జాన్సీ లక్ష్మీబాయి, కొమరం భీం లాంటి మాతృ భాష మాట్లాడే నాయకులే గొప్పవాళ్లు అయ్యారన్నారు.. ఇక, మాతృ భాషలో చదువుకున్న మహిళ ఈ రోజు దేశ మొదటి మహిళగా ఉన్నారని అన్నారు.. కాన్వెంట్ మొహం చూడని నరేంద్ర మోడీ.. ప్రపంచదేశాల మన్నన పొందుతున్న మన దేశ ప్రధానిగా ఉన్నారని పేర్కొన్నారు.. మాతృ భాషను ప్రేమించండి, సోదర భాషను గౌరవించండి, అంతర్జాతీయ భాషని నేర్చుకోండి అని సూచించారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
Read Also: DSC Results 2024: ‘టీజీ డీఎస్సీ-2024’ పరీక్ష ఫలితాలు విడుదల