AP Crime: కూతురు కాపురం పచ్చగా ఉండాలని కోరుకుంటుంది ఏ అత్త అయినా.. అయితే తన కూతురిని తన వద్దకు రానివ్వడం లేదని అల్లుడిపై పగ పెంచుకుంది ఓ అత్త.. అంతేకాదు అల్లుడిని కిడ్నాప్ చేసి హత్య చేయాలని స్కెచ్ వేసింది.. దీని కోసం కొంత మందితో కలిసి ప్లాన్ చేసింది.. అల్లుడిని అడ్డు తొలగించుకుంటే.. కూతురు తన వద్దకు వస్తుందని భావించింది.. అయితే, కిడ్నాపర్లతో కలిసి అత్త చేసిన ప్రయత్నం ఫెయిల్ అయ్యింది… చివరకు అత్తతోపాటు కిడ్నాపర్లు కటకటాల వెనక్కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Read Also: Crime News: సిద్ధిపేటలో దారుణం.. ఆస్తి కోసం కన్నతల్లిని కడతేర్చిన కూతురు..
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మణికంఠకు నాలుగేళ్ల క్రితం పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన లిఖితతో పెళ్లయింది. వీరికి ఒక కుమార్తె సంతానం.. అయితే, పెళ్లి జరిగినప్పటి నుంచి అత్త విజయలక్ష్మి ప్రవర్తన మణికంఠకు నచ్చలేదు. దీంతో, తన భార్య లిఖితను కూడా పుట్టింటికి దూరంగా ఉండాలని చెప్పారు. లిఖిత కూడా తల్లితో దూరంగా ఉంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో తన కూతుర్ని తనకు దూరం చేస్తున్నాడని అల్లుడు మణికంఠపై అత్త విజయలక్ష్మి పగ పెంచుకుంది. అల్లుడు అడ్డు తొలగించుకుంటే కూతురు తన వద్దకు వస్తుందని భావించింది. పక్కా పథకం ప్రకారం నలుగురితో కలిసి తెనాలి చేరుకుంది. రాత్రి సమయంలో అల్లుడు మణికంఠను బలవంతంగా కారులో ఎక్కించుకొని బయలుదేరింది. తెనాలి శివారుకు వచ్చిన తర్వాత మణికంఠపై అందరూ కలిసి కర్రలతో దాడి చేశారు. మణికంఠను బలవంతంగా కారులో ఎక్కించుకోవడం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. తెనాలి 3 టౌన్ పోలీసులు వెంటనే స్పందించి చేబ్రోలు మండలం కారును శేకూరు వద్ద కారును అడ్డుకున్నారు. మణికంఠను కాపాడి కిడ్నాప్ కు ప్రయత్నించిన అత్త విజయలక్ష్మితో పాటు ఆమెతో సహకరించిన నలుగురిని అరెస్టు చేశారు. ఇక, అల్లుడి కిడ్నాప్, హత్యకు అత్త చెప్పిన కారణం విని పోలీసులు కూడా షాక్ తినాల్సి వచ్చింది..
