NTV Telugu Site icon

Nadendla Manohar: నాలుగు సంవత్సరాల తర్వాత రైతులకు నిజమైన సంక్రాంతి వచ్చింది..

Nadendla

Nadendla

గుంటూరు జిల్లా తెనాలి మండలం పెద‌రావూరులో సంక్రాంతి సంబరాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. వ్యవ‌సాయ క్షేత్రంలో భోగిమంటలను వెలిగించారు. అనంతరం.. భోగి వేడుక‌ల్లో పాల్గొన్నారు. మహిళలు, నాయకులు, కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాల తర్వాత రైతులకు నిజమైన సంక్రాంతి వచ్చిందని అన్నారు. సంక్రాంతి పండుగ ప్రజ‌లంద‌రి జీవితాల్లో వెలుగులు నింపాల‌ని.. సంక్రాంతి అంటేనే మ‌న తెలుగింటి పండుగ అని.. ప్రతి ప‌ల్లెలో మ‌న సంస్కృతి ప్రతి బింబించే విధంగా పండుగ‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటామ‌ని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Read Also: Pineapple Health Benefits: ఒక్క పైనాపిల్ తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?.. తెలిస్తే వదిలిపెట్టరు!

ప్రతి ఏటా చేసేలా మిత్రులంద‌రితో క‌లిసి భోగి మంట‌లు ఏర్పాటు చేసుకోవ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. అంద‌రికీ మంచి జ‌ర‌గాలని.. ప్రజల‌కు, రైతాంగానికి మేలు చేసే విధంగా ప్రతి ఇంట్లో చిరున‌వ్వు నింపే విధంగా స‌క్రాంతి పండుగ‌ను ప్రజ‌లు సంతోషంగా జ‌రుపుకోవాలని ఆకాంక్షించారు. కూట‌మి ప్రభుత్వం రైతుల‌కు అండ‌గా ఉంటుందని, రైతాంగానికి భ‌రోసా ఇస్తున్నామ‌న్నారు. రైతు స‌హాయ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేశామ‌ని.. 24 గంట‌ల్లోనే రైతుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ చేశామ‌ని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. రైతులు నాలుగు సంవ‌త్సరాల త‌ర్వాత సంక్రాంతి పండుగ‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారని మంత్రి మ‌నోహ‌ర్ పేర్కొన్నారు.

Read Also: Pawan Kalyan: కూటమి ఆరు నెలల పాలనలో అభివృద్ధిపై డిప్యూటీ సీఎం ట్వీట్..