Site icon NTV Telugu

Minister Nadendla: కృష్ణానదికి భారీగా వరద నీరు.. లంక గ్రామాల ప్రజలకు మంత్రి నాదెండ్ల అలర్ట్!

Nadendla

Nadendla

Minister Nadendla: గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. కొల్లిపర మండలం కరకట్ట లంక ప్రాంతాలు, తెనాలి మండలం గోలి డొంక పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టంపై రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ముంపునకు గురైన ప్రాంతాలు, పొలాల వివరాలను అధికారుల ద్వారా మంత్రి సేకరించారు.

Read Also: Ownly: ‘ఓన్లీ’ ప్రారంభించిన ర్యాపిడో.. స్విగ్గీ, జొమాటోల ఆధిపత్యానికి సవాల్!

ఇక, మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఆకాల వర్షాలతో రైతులు కొంత ఇబ్బందులు పడుతున్నారు.. 5 నెలల్లో పడాల్సిన వర్షం 2 గంటల్లో పడటం వల్ల కొంత పంట నీట మునిగింది.. ఇప్పటి వరకు 14 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.. ఇంకా పంట నష్టం వివరాలు రావాల్సి ఉంది.. కృష్ణ వరద నీరుకి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.. కొల్లిపర మండలంలో కొన్ని గ్రామాలు పంట నష్టం వాటిల్లింది.. ప్రభుత్వం రైతులను, కౌలు రైతులను కూడా ఆదుకుంటుంది.. విత్తనాలపై ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు అందిజేస్తామని మంత్రి నాదెండ్ల తెలియజేశారు.

Read Also: Supreme Court : ఈ నెల 19లోగా ఓట్లు తొలగించిన వారి జాబితా ఇవ్వాలన్న సుప్రీంకోర్టు.

అయితే, ముంపు గ్రామాల్లో అన్ని రకాల నిత్యావసర సరుకులు వసతులు రెండు బోట్లు ఏర్పాటు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వర్షాల వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. లంక గ్రామాలలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు సూచనలు చేశాం.. రెండు రోజులుగా భారీ వర్షాలతో జనం ఇబ్బందులు పడ్డారు.. ఇప్పటికే కృష్ణానది తీర ప్రాంతంలోని ప్రజలను అలర్ట్ చేశామన్నారు. లంక గ్రామాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

Exit mobile version