NTV Telugu Site icon

Lady Aghori: కుటుంబంలో అఘోరీ అలజడి.. అసలేం జరిగింది..!

Lady Aghori

Lady Aghori

Lady Aghori: రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా లేడీ అఘోరీగా చలామణి అవుతున్న అలియాస్ అల్లూరి శ్రీనివాస్ తో మంగళగిరికి చెందిన బీటెక్ చదివిన శ్రీవర్షిణి అనే యువతి వెళ్లిపోవటం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ ఘటనపై అటు హైదారబాద్ లో ఉన్న వనస్థలిపురంలో, గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీవర్షిని తండ్రి కోటయ్య ఫిర్యాదు చేశాడు. తన కుమార్తెను మాయమాటలు చెప్పి అఘోరీ తీసుకువెళ్లాడని యువతి తండ్రి తురిమెల్ల కోటయ్య మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నాలుగు నెలల క్రితం అఘోరీ మంగళగిరిలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయానికి వచ్చినా పోలీసులు లోపలకు వెళ్ళకుండా అడ్డుకున్నారు. దీంతో అఘోరీ హైవేపై గందరగోళం చేయటంతో విషయాన్ని అఘోరీ గురువుకు చేరవేశారు. దీంతో ఈ విషయాన్ని వెంటనే అఘోరీ డ్రైవర్ ఆమె గురువుకి చెప్పటంతో అఘోరీకి సాయం చేయాలని తనకు పరిచయం ఉన్న శ్రీవర్షిని అన్నలకు ఫోన్ చేశారు. దీంతో వెంటనే శ్రీవర్షిణి అన్నలు ఇద్దరు కూడా ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని చక్కబెట్టారు.

Read Also: GV Prakash : ఒకే సారి మూడు సినిమాలు.. హిట్ దక్కేనా..?

అయితే, ఈ ఘటన జరిగిన రోజు అఘోరీ శ్రీవర్షిణి ఇంటికి వెళ్లి అక్కడే ఉంది. ఆ తర్వాత నుంచి తన కారు రిపేర్ లో ఉందని ఇతరత్రా కారణాలు చెప్పి వారి ఇంట్లోనే అఘోరీ ఉంది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న శ్రీవర్షిణితో పరిచయం పెంచుకుని మాయమాటలు చెప్పింది. తన దగ్గర అద్భుత శక్తులు ఉన్నాయని చెప్పింది. శ్రీవర్షిణిని ఒంటిరిగా కూర్చోబెట్టి వశీకరణ ముద్రలు ఆమెపై వేయటంతోపాటు పసరును అన్నంలో కలిపి వెళ్లిపోయింది అఘోరీ. ఆ తర్వాత రోజు నుంచి శ్రీవర్షిని తేడాగా ప్రవర్తించటంతో తండ్రి కోటయ్య ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. డాక్టర్ పరీక్షలు జరిపి రెండు రోజులకు సరిపడా కోర్సు టాబ్లెట్స్ ఇచ్చారు. శ్రీవర్షిణి ఒక రోజు కోర్సు టాబ్లెట్స్ వాడి రెండో కోర్సు వాడను అని మొండికేసింది. ఆ తర్వాత ఇంటి నుంచి శ్రీవర్షిణి వెళ్లిపోయింది. విజయవాడ బస్టాండ్ కు వెళ్లి తన స్నేహితురాలికి ఫోన్ చేసి.. ఫోన్ పేలో 700 వేయించుకుని హైదరాబాద్ వెళ్లింది. విషయం తెలసుకున్న తండ్రి కోటయ్య వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా అఘోరీని పిలపించి విచారణ చేశారు.

Read Also: AP High Court: భీమిలి తీర ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

శ్రీవర్షిణిని తల్లిదండ్రులకు అప్పజెప్పాలని అఘోరీకి పోలీసులు చెప్పటంతో శ్రీవర్షిణి ఒంటరిగా గుంటూరు జిల్లా మంగళగిరి వచ్చింది. మంగళగిరి పోలీసులను కలిసిన శ్రీవర్షిని తాను మేజర్ ని అని తాను ఇష్టపూర్వకంగానే అఘోరీతో వెళ్తున్నట్టు లికిత పూర్వకంగా రాసిచ్చింది. అదే విషయాన్ని పోలీసులు కూడా శ్రీవర్షిని తల్లిదండ్రులుకు చెప్పారు. దీంతో శ్రీ వర్షిణి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తమ కూతూరిని ఆఘోరి వశపరుచుకుందని కాపాడాలని.. అఘోరి చెర నుంచి తమ కూతురును విడిపించి తమకు అప్పగించాలని వేడుకుంటున్నారు. స్థానికంగా ఈ వ్యవహారం చర్చగా మారింది.