Site icon NTV Telugu

MP Kesineni Chinni: జగన్ బొమ్మతో రైతులకు ఇచ్చిన పాసు పుస్తకాలను భోగి మంటల్లో వేసిన ఎంపీ

Keshineni

Keshineni

MP Kesineni Chinni: జగన్ బొమ్మతో గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన పాసు పుస్తకాలను విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని భోగి మంటల్లో వేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు చెందిన ఆస్తులపై గత ప్రభుత్వంలో జగన్ బొమ్మ వేసుకున్నారు అని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ బొమ్మ తొలగించి రాజముద్రతో పాసు పుస్తకాలు జారీ చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వం విధానాలను నిరసనగా భోగి మంటల్లో జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాలు వేశాం.. మెడికల్ కళాశాలలను నిర్మించే జీవోలను వైసీపీ ప్రభుత్వమే తీసుకు వచ్చింది.. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవోలను వైసీపీ నేతలే భోగి మంటల్లో వేసి కాల్చి వేస్తున్నారు అని తెలిపారు. గత సర్కార్ లో విజయవాడ నగరం అభివృద్ధికి నోచుకోలేదు అని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు.

Read Also: Sudha Kongara : ఫేక్ ఐడీలు, నెగటివ్ రివ్యూలు.. విజయ్ ఫ్యాన్స్‌పై సుధా కొంగర ఫైర్!

ఇక, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయవాడ పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాం అని టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి విజయవాడను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు. విజయవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తూ అభివృద్ధి చేస్తున్నాం.. పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాల కల్పనకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు అని వెల్లడించారు.

Exit mobile version