Guntur Mirchi Cold Storage Case: గుంటూరు మిర్చి కోల్డ్ స్టోరేజ్ లో జరిగిన చీటింగ్ వ్యవహారంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు… ఇప్పటికే ఈ వ్యవహారంలో కోల్డ్ స్టోరేజ్ కు చెందిన నాగిరెడ్డి, రామచంద్ర రావు, వెంకటేశ్వర్ రెడ్డి అనే ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు పోలీసులు.. మరోవైపు మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ కూడా రంగంలోకి దిగి.. కోల్డ్ స్టోరేజ్ రికార్డులను పరిశీలించారు…
Read Also: Bathukamma 2024: నేటి నుంచి పూల పండుగ.. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ
రైతులకు చెందిన కోట్ల రూపాయల విలువైన మిర్చిని కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం అమ్మేసుకుందని, కొంత భాగం మిర్చిని బ్యాంకులో తనాక పెట్టిందని, ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యంపై అధికారులు చర్యలు ప్రారంభించారు… మరోవైపు రైతులకు జరిగిన అన్యాయంపై జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు.. కోల్డ్ స్టోరేజ్ యాజమాన్య నిర్వాకంతో, గుంటూరు, పల్నాడు, నంద్యాల వంటి ప్రాంతాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే రామాంజనేయులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.. ఈ నేపథ్యంలో అవసరమైతే కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం ఆస్తులు జప్తు చేసి అయినా రైతులకు న్యాయం చేస్తామని అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది..