Bathukamma 2024: బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక. ఇది ప్రకృతితో మమేకమైన పండుగ. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా జానపద పాటలతో ఆడుతూ పాడుతు చేసుకునే గొప్ప పండు. తెలంగాణలోని ప్రతి గ్రామం రంగురంగుల పూలతో సుందరంగా మారుతోంది. నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. రాష్ట్ర పండుగ అయిన ‘బతుకమ్మ’ ఉత్సవాలు జరుపుకునేందుకు తెలంగాణ ఆడపడుచులు సిద్దమయ్యారు. తెలంగాణలోని పల్లెల్లో బతుకమ్మ సంబరాలను అంబరాన్ని అంటేలా నిర్వహిస్తారు. పెళ్లైన ఆడవాళ్లు పుట్టింటికి వచ్చి బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మను పేర్చేందుకు మగవాళ్లు పొలాలకు పోయి తంగేడు, మందారం, బంతి, సీతజడలు, తామరపూలతో పాటు ఇంకా ఎన్నో రకాల పూలను తీసుకొస్తే.. వాటితో ఆడవాళ్లు బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మకు ఒక్కోరోజు ఒక్కో నైవేద్యం పెడతారు. తొమ్మిదిరోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసలు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, బెల్లం, పాలతో చేసినవి సమర్పిస్తారు. బతుకమ్మను ఒక్కోరోజు ఒక్కో పేరుతో పిలుస్తారు.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ పండుగ ఏటా ‘పెత్రమాస’కు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమవుతుంది. దీన్ని పెత్తర అమావాస్య అని ఎందుకు అలా పిలుస్తారో తెలుసా? సాధారణంగా పూలను చేయి లేదా కత్తెరతో కట్ చేస్తాం. కానీ, కొందరు నోటితో కూడా తుంచి బతుకమ్మను తయారు చేస్తారు. ఆ విధంగా మొదటిరోజు చేసే బతుకమ్మకు ఎంగిలిపూల బతుకమ్మ అని ప్రాచుర్యంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో పండుగకు పెద్దపీట వేసింది. వారి నుండి ఇది క్రమంగా రాష్ట్రం వెలుపల నుండి వచ్చే ప్రయాణికులలో ఆదరణ పొందుతోంది. సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళల చేతుల్లో రంగురంగుల పూలతో బతుకమ్మను పేరుస్తారు. ఇక రెండోరోజు అటుకుల బతుకమ్మ, మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగోరోజు నాన బియ్యం బతుకమ్మ, ఐదోరోజు అట్ల బియ్యం బతుకమ్మ, ఆరో రోజున అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదోరోజు బతుకమ్మ అని పిలుచుకుంటారు.
Dussehra Holidays 2024: నేటి నుంచే దసరా సెలవులు.. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు..