NTV Telugu Site icon

Ambati Rambabu: దొంగతనం చేశానని తెలిసే చంద్రబాబు భయపడుతున్నాడు

Ambati

Ambati

Ambati Rambabu: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకి ఐటీ నోటీసులు ఇచ్చారు.. అవంటే ఎందుకు అంత భయమని అన్నారు. దొంగ తనం చేశానని తెలిసే చంద్రబాబు భయపడుతున్నాడని మంత్రి ఆరోపించారు. నోటీసులు ఇచ్చిన అధికారులను చంద్రబాబు ఎదురు ప్రశ్నిస్తున్నాడని దుయ్యబట్టారు. చంద్రబాబు ముడుపులు తీసుకున్న మాట నిజం అని అధికారులు నిర్ధారించుకున్న తర్వాత అధికారులు నోటీసులు ఇచ్చి ఉంటారని అంబటి పేర్కొన్నారు.

Read Also: Vishal: అర్ధరాత్రి నన్ను బ్లాక్ మెయిల్ చేసి ఆ నిర్మాతలు డబ్బులు గుంజారు..

మరోవైపు చంద్రబాబును అరెస్ట్ చేస్తారని ఆయనే చెప్పుకుంటున్నారని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. తప్పు చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు.. చంద్రబాబు ఏమన్నా పెద్ద మగాడా అరెస్ట్ చేయకుండా ఉండడానికి అని విమర్శలు గుప్పించారు. తప్పు చేసిన వారు దుబాయ్ వెళ్లినా, అమెరికా వెళ్లినా అరెస్ట్ తప్పదన్నారు. పోలీసుల మీద రాళ్లు వేసి దాడులు చేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి తెలిపారు.

Read Also: G20 Summit 2023 LIVE UPDATES: జీ20 సదస్సు.. ఢిల్లీకి చేరుకున్న అమెరికా అధ్యక్షుడు

ఆంధ్ర రైతులు నీటి ఎద్దడి పరిస్థితిలో ఉన్నారని అంబటి అన్నారు. 122 ఏళ్లలో ఎప్పుడు ఈ పరిస్థితి లేదని.. దీనికి కారణం చంద్రబాబు అని ప్రజలు అనుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు. నీటి ప్రాజెక్టుల వద్ద చంద్రబాబు ముదనష్టపు కాలు పెట్టడం వల్లే నీటి ప్రాజెక్ట్ లు ఎండి పోతున్నాయని అనుకుంటున్నారని విమర్శించారు. నిజం ఏంటో ప్రజలే నిర్ణయిస్తారని.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరు తడి పంటల పై రైతులు దృష్టి పెట్టాలని కోరారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో వర్షాలు లేవన్నారు. సాగర్ పరిధిలో పరిస్థితిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని అంబటి రాంబాబు తెలిపారు.