NTV Telugu Site icon

Vidadala Rajini: ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను అనారోగ్య ప్రదేశ్‌గా మార్చేస్తున్నారు..

Vidadala Rajini On Jagananna Arogya Suraksha

Vidadala Rajini On Jagananna Arogya Suraksha

కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి విడదల రజని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేద వాడికి కార్పొరేట్ వైద్యం అందాలని ఆశయంతో.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీ పథకంను ప్రారంభించారని తెలిపారు. జగనన్న ప్రభుత్వంలో ఆరోగ్య శ్రీ పరిధి పెంచాం.. ఐదు లక్షల నుండి 25 లక్షలకు ఆరోగ్యశ్రీ పరిధిని పెంచామని చెప్పారు. ఒక సీఎంకి ఏ స్థాయి వైద్యం అందుతుందో.. అదే వైద్యం పేదలకు అందాలన్నది వైఎస్ కుటుంబ లక్ష్యం అని విడదల రజని తెలిపారు. పేద వారికి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా.. గత ప్రభుత్వంలో ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించామన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను ఈరోజు అనారోగ్య ప్రదేశ్‌గా మార్చేస్తున్నారని విమర్శించారు.

Read Also: CM Chandrababu: కుప్పం అభివృద్ధికి ‘జననాయకుడు’ ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించాం..

నెట్ వర్క్ హాస్పిటల్స్‌కు మూడువేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.. నెట్ వర్క్ హాస్పిటల్స్ వైద్యాన్ని నిలిపివేసిన పరిస్థితి నెలకొందని రజని తెలిపారు. పేద వారికి అనారోగ్యం వస్తే ఎక్కడికి వెళ్ళాలి.. ఈ ప్రభుత్వం స్పందించాలని అన్నారు. కొవిడ్ లాంటి వ్యాధి దాడి చేసినా.. వైఎస్ జగన్ ప్రభుత్వం వెనకడుగు వేయలేదని చెప్పారు. కొవిడ్‌ను కూడా ఆరోగ్యశ్రీ పథకంలోకి తీసుకు వచ్చామన్నారు. 2014 నుండి 19 వరకు అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.5100 కోట్లు ఖర్చు చేసింది.. 2019 నుండి 24 వరకు వైసీపీ ప్రభుత్వం 13,500 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే నెట్ వర్క్ హాస్పిటల్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య శ్రీ నిర్వహణ కూడా థర్డ్ పార్టీకి అప్పగించాలని చూస్తున్నారు.. ప్రైవేటు ఇన్స్యూరెన్స్ కంపెనీలకు ఆరోగ్య శ్రీ ట్రస్ట్ నిర్వహణ అప్పగిస్తే పేద ప్రజలు ఎక్కడికి వెళ్ళాలని విడదల రజని ప్రశ్నించారు.

Read Also: Suresh: నదియాతో ప్రేమ.. రహస్యం బట్టబయలు చేసిన నటుడు!

నిబంధనల పేరుతో పేద ప్రజలను కార్పొరేట్ వైద్యానికి దూరం చేస్తారా..? విడదల రజని ప్రశ్నించారు. ప్రతి పేదవాడికి ఆరోగ్య భద్రత కల్పించేది ఆరోగ్య శ్రీ పథకం.. అలాంటి ఆరోగ్య శ్రీని థర్డ్ పార్టీ ఊబిలోకి లాగవద్దని సూచించారు. ఆరోగ్య శ్రీని వ్యాపారం చేయవద్దు.. ఇలాంటి చర్యలను వైసీపీ వ్యతిరేకిస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఆరోగ్య ఆసరా ఉసే లేదన్నారు. ఉన్న మెకానిజంని పక్కన పెట్టి.. హైబ్రిడ్ మెకానిజం అని పక్క చూపులు చూడటం ఎందుకు అని విమర్శించారు. గత ప్రభుత్వం పేదల ఆరోగ్యం నిధులు ఖర్చు చేస్తే.. ఇప్పటి ప్రభుత్వం ఆ బిల్లులు చెల్లించారా అని అన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడగానే.. ఆరోగ్య శ్రీ పాత బకాయిలు రూ.632 కోట్లు జగనన్న ప్రభుత్వం కట్టిందని విడదల రజని చెప్పారు.