NTV Telugu Site icon

Bandi Srinivasa Rao: నాలుగున్నరేళ్ల నుంచి మోసం చేస్తూనే ఉన్నారు..

Bandi Srinivasa Rao

Bandi Srinivasa Rao

తమ డిమాండ్లను ప్రభుత్వం తీర్చులేకపోతుందని ఏపీ జేపీసీ ఆరోపిస్తుంది. ఇప్పటికే పలుమార్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలు, IR ఇవ్వకపోడంతో ఏపీ జేపీసీ ఉద్యమ బాట పట్టింది. ఈ క్రమంలో ఈనెల 27వ తేదీన ఛలో విజయవాడ కార్యక్రమం చేపడుతామని జేఏసీ నేతలు చెబుతున్నారు.

Navi Mumbai: నవీ ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. రెండు ఫ్యాక్టరీల్లో మంటలు

ఇదిలా ఉంటే.. ఈరోజు గుంటూరు తాలూకా కార్యాలయం ఎదుట ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక పెంక్షనర్ల ఐక్యకార్యాచరణ సమితి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉద్యోగులకు రావలసిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి…12వ పీఆర్సీని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల14వ తేదీ నుంచి తాలూకా స్థాయి నుంచి ఉద్యోగులు నిరసనకు దిగారని తెలిపారు.

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దారుణం..గర్భిణిపై గ్యాంగ్ రేప్ చేసి, నిప్పంటించారు..

మరోవైపు.. ప్రభుత్వాన్ని తమకు న్యాయంగా రావలసిన 12వ పీఆర్సీ, బకాయి డీఏలు ఇవ్వాలని కోరడం నేరమా అని బండి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఇప్పటికే రూ.26వేల కోట్లు బకాయిలు ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని అన్నారు. చివరకు జీపీఎఫ్ నిధులను సైతం లేని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. అంతేకాకుండా.. మెడికల్ బిల్లులు సైతం రావడం లేదు, జీవోలు విడుదల చేస్తున్నారు కానీ నిధులు మాత్రం రావడం లేదని అన్నారు. పీఆర్సీ కోసం పోరాటం చేస్తే ఇంతవరకు వాటిని కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. నాలుగున్నర సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేస్తూనే ఉందని పేర్కొన్నారు.