NTV Telugu Site icon

Pawan Kalyan: వన్య ప్రాణులను వేటాడినా, చంపినా కఠిన చర్యలు..

Pawan

Pawan

సోమవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో వన్యప్రాణాల సంరక్షణ కోసం అటవీ శాఖలోని యాంటీ పోచింగ్ సెల్ రూపొందించిన పోస్టర్ ను డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ విడుదల చేశారు. అంతేకాకుండా.. వన్యప్రాణుల వేట, అక్రమ రవాణా సమాచారం ఉంటే యాంటీ పోచింగ్ సెల్ కు తెలిపేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ‘వన్యప్రాణులను వేటాడటం.. చంపడం.. అక్రమ రవాణా చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన శిక్షలు ఉంటాయి. అడవులను సంరక్షించడం, వన్యప్రాణులను కాపాడటం మనందరి బాధ్యత. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్లు మనది వసుధైక కుటుంబం. భూమ్మీద మనతో పాటు సహజీవనం చేస్తున్న జంతువులు, చెట్లు చేమలు, పశు పక్షాదుల పట్ల కరుణ చూపాలని, వాటికి మనలాగే బతికే హక్కు ఉంది’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Read Also: Chandrababu: మద్యం ధరలు, ఇసుక సరఫరాపై సమీక్షలో చంద్రబాబు వార్నింగ్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “వన్య ప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం వన్య ప్రాణులను వేటాడటం, చంపడం, అక్రమ రవాణా చేయడం నిషేదం. ఎవరైనా వన్యప్రాణులను వేటాడటం, అటవీ సంపదన నాశనం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. మంచి ప్రభుత్వంతో పాటు బాధ్యత గల ప్రభుత్వం అని అన్నారు. ముఖ్యంగా అటవీశాఖ అధికారులు విధులకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. చిత్తూరు జిల్లా కౌండిన్య అభయారణ్యంలో ఇటీవల చిరుత పులిని చంపిన నిందితులను మూడు రోజుల్లో పట్టుకొని రిమాండ్ కు తరలించామని చెప్పారు. అలాగే పల్నాడు జిల్లాలో అరుదైన జంతువును చంపిన నిందితులను రోజుల వ్యవధిలో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా వన్యప్రాణులను వేటాడినా, చంపినా, అక్రమ రవాణాకు పాల్పడినా అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకురండని పవన్ కల్యాణ్ సూచించారు. 18004255909 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం అందించండి. అలాగే అటవీ సంపదను నాశనం చేసినా, అక్రమ మైనింగ్ కు పాల్పడిన అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

Read Also: PKL: హమ్మయ్య… గెలిచారు… తెలుగు టైటాన్స్ విజయం

Show comments