Site icon NTV Telugu

CPI Ramakrishna : ఎమ్మెల్సీ అనంత బాబును వెంటనే అరెస్ట్ చేయాలి

Cpi Ramakrishna

Cpi Ramakrishna

వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం అనుమానాస్పద మృతి కేసు నేపథ్యంలో గత రెండు రోజులుగా కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్త పరిస్దితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే నిన్న రాత్రి సుబ్రమణ్యం భార్యను, కుటుంబ సభ్యలు ఒప్పించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. అంతేకాకుండా అర్థరాత్రి వీడియో నడుమ 5గురు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అంతేకాకుండా సుబ్రమణ్యంది హత్యేనని ప్రాథమిక రిపోర్టు ఇచ్చారు. అయితే నేడు సుబ్రమణ్యం సొంతూరులో అంత్యక్రియలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ… డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యోదంతంపై ఈనెల 23న విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎమ్మెల్సీ అనంత బాబును వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. హతుడు సుబ్రహ్మణ్యం కుటుంబానికి రూ.1 కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ఎమ్మెల్సీ అనంతబాబుపై కఠిన చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.

Exit mobile version