Site icon NTV Telugu

CM Chandrababu: చరిత్రలో ఎప్పుడూ చూడని రాజకీయం 2019-24 మధ్య చూశాను..

Cbn

Cbn

CM Chandrababu: గుంటూరు జిల్లాలోని పొన్నెకల్లులో నిర్వహించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 134వ జయంతి వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఇక, పొన్నెకల్లు ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. మీలో రాజధాని ఉత్సాహం కనిపిస్తుంది.. భవిష్యత్తులో మేము ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదన్న సంతోషం మీలో కనిపిస్తుంది అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది.. మనం ఇలా సంతోషంగా ఉన్నామంటే అంబేడ్కర్ రాజ్యాంగమే కారణం.. నేను మీకు ఆయుధాలు ఇవ్వలేదు… ఓటు హక్కు ఇచ్చాను అని‌ అంబేడ్కర్ అన్నారు.. గత ఐదేళ్లలో ఆనందంగా ఉన్నారా అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు.

Read Also: CLP Meeting: సీఎం అధ్యక్షతన సీఎల్పీ సమావేశం.. ఆ అంశాలపై దిశానిర్దేశం!

ఇక, రాజధానిని ‌స్మశానం అన్నారు.. ఈ రోజు స్వేచ్చా వాతావరణంలో మాట్లాడుకుంటున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2019 నుంచి 2024 వరకూ భయంకరమైన వాతావరణం ఉంది.. నా జీవితంలో అలాంటిది ఎప్పుడూ చూడలేదు.. నేనుకూడా బయటకు రాలేని‌ పరిస్థితి ఉండేదన్నారు.. హెలికాప్టర్ లో వస్తే కింద ఉన్న చెట్లను ‌నరికేశారు.. ఎన్నికలలో నిలబెట్టిన వారిలో 94 శాతం మంది గెలిపించారు.. పేదలకు అండగా ఉంటాను, సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పాను.. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తున్నాం.. కూటమి ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందన్నారు. అలాగే, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది.. ఎన్టీఆర్ కు అంబేడ్కర్ అంటే అమితమైన గౌరవం ఉండేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Read Also: Home Minister Anitha: బాణాసంచా తయారీ కేంద్రాలపై కొరవడిన నిఘా.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

అయితే, ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్‌గా ఉన్నప్పుడే అంబేడ్కర్ కు భారతరత్న ఇచ్చారు అని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. నేను‌ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఒక కుటుంబాన్ని కలిశాను.. చిన్న రేకుల ఇంట్లో ఉంటున్నారు.. ఒకతను కార్పెంటర్, మరొకరు మెకానిక్ గా పని చేస్తున్నారు.. ఆ ఇంట్లో 10 మంది ఉన్నారు.. క్షేత్రస్థాయిలో చూస్తేనే వాస్తవ పరిస్థితి అర్థమవుతుంది.. అందులో నుంచి పుట్టిన ఆలోచనే పీ-4 కార్యక్రమం అన్నారు. ఇక, ప్రతినెలా మీటింగులు‌ పెట్టాం.. గ్రామంలో ఎక్కడా దళితులపై దాడులు జరగకూడదని ఆదేశించాను.. ఇప్పుడు ఎక్కడా ఎలాంటి ఫిర్యాదులు రావడం లేదు.. భవిష్యత్తులో ఎస్సీల పిల్లలందరూ చదువుకునేలా చూస్తాం.. రత్నలత తండ్రి ఎంత ఆనందంగా ఉన్నారో చూశాం.. కూతురు విదేశంలో ఉద్యోగం చేస్తున్నదుకు సంతోషంగా ఉందన్నారని చంద్రబాబు తెలిపారు.

Exit mobile version