CM Chandrababu: మాజీ మంత్రి వైఎస్ వివేకా నందరెడ్డి హత్య కేసులో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. గుంటూరులోని ఆర్వీఆర్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసు ఏఐ హ్యాకథాన్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్ వివేకా హత్య కేసులో గూగుల్ టేక్ అవుట్ లో దొరికిపోయారని పేర్కొన్నారు.. తెనాలిలో గంజాయి బ్యాచ్ పోలీసులపై దాడిచేస్తే వారికి సంఘీభావం చెబితే చూస్తూ ఊరుకోవాలా.? అని ప్రశ్నించిన ఆయన.. బాబాయిని చంపి నా మీదే ఆరోపణలు చేశారు.. మొదట గుండెపోటు అన్నారు.. పోస్టుమార్టం తర్వాత మా నాన్న లేరు… చిన్నాన్న హత్యకు గురయ్యారన్నారు. మరుసటిరోజు నారాసుర రక్తచరిత్ర అన్నారు అంటూ ఫైర్ అయ్యారు.. అయితే, ఆ రోజే నిందితులను అరెస్టు చేసి ఉంటే ఇలాంటివి జరిగేనా..? అని ప్రశ్నించారు చంద్రబాబు..
Read Also: MP: ఏకంగా సీఎం కాన్వాయ్ వాహనాల్లో కల్తీ డీజిల్.. ఒక్కసారిగా ఆగిన 19 కార్లు..!
అత్యంత దారుణంగా గొడ్డలితో వైఎస్ వివేకాను హత్యచేశారు.. కొత్తతరం రాజకీయం వచ్చింది.. ఇప్పుడు రౌడీలే రాజకీయాల్లోకి వచ్చారని మండిపడ్డారు.. పోలీసులు వారి ముసుగు తీసి వారిని నేరస్థులుగా చూడకపోతే లా అండ్ ఆర్డర్ కాపాడలేరన్నారు.. ఏపీలో ఫ్రెండ్లీ పోలీసింగ్ కు శ్రీకారం చుట్టాం.. పోలీసులకు బాడీ కెమెరా ఇచ్చాం.. పల్నాడులో తప్పుచేసి ఎలా బుకాయిస్తున్నారో చూశాం.. తప్పుచేస్తామంటే ఊరుకోం.. టెక్నాలజీ లేనప్పుడే నేనేంటో చూపించా.. ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే ఏంచేస్తామో మా ప్రభుత్వం చేసి చూపిస్తాం అని వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
