CM Chandrababu at Acharya N.G. Ranga 125th Birth Anniversary: ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి వేడుకల్లో కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్జీ రంగా దేశ స్వాతంత్య్ర పోరాటంలో, రైతాంగ ఉద్యమంలో, గ్రామీణ అభివృద్ధిలో చేసిన విశేష సేవలను గుర్తుచేశారు. “ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతితో పాటు వందేమాతరం 150వ వార్షికోత్సవాలు ఒకే రోజున జరగడం చారిత్రాత్మకం” అన్నారు. రంగా ఆర్థిక శాస్త్రంలో నైపుణ్యత సాధించి, గాంధీజీ పిలుపుతో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. సైమన్ కమిషన్ గో బ్యాక్, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్నారని గుర్తుచేశారు. కేవలం 33 ఏళ్ల వయసులో ఆంధ్ర రైతాంగ ఉద్యమాన్ని ముందుకు నడిపి, రైతులకు శిక్షణ ఇచ్చేందుకు పాఠశాల ప్రారంభించారని చెప్పారు.
Read Also: Illegal Nuclear: పాకిస్తాన్ కూడా రహస్యంగా అణ్వాయుధాలను పరీక్షిస్తుంది..
ఎన్డీ రంగా దేశం కోసం, రైతుల కోసం ఒకే సమయంలో పోరాడారు. 1964లో వచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను పార్లమెంటులో రద్దు చేయాలని కఠినంగా పోరాడారు అని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.. జవహర్‌లాల్ నెహ్రూ కూడా “రంగా పార్లమెంట్‌లో ఉన్నంతకాలం రైతులు సుభిక్షంగా ఉంటారు” అని అన్నారని తెలిపారు. రంగా చేసిన సేవలకు పద్మవిభూషణ్‌తో పాటు అనేక అవార్డులు లభించాయని అన్నారు. తాను మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రంగా పేరు పెట్టినట్లు, ఆ పేరు రాష్ట్ర విభజన తర్వాత తొలగించారని, అందుకే ఏపీలో కొత్తగా రంగా పేరిట విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామని చంద్రబాబు తెలిపారు.
Read Also: CM Revanth Reddy : బ్యాడ్ బ్రదర్స్ కిషన్ రెడ్డి, కేటీఆర్.. ఇద్దరు కలిసి..
యాభై ఏళ్ల పాటు పార్లమెంటు సభ్యునిగా ఉన్న అరుదైన వ్యక్తి రంగా.. ప్రాంతాలకు అతీతంగా నాలుగు నియోజకవర్గాల నుంచి ఎంపీగా గెలిచారు అని పేర్కొన్నారు చంద్రబాబు.. రంగా స్ఫూర్తితోనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తాను పీహెచ్‌డీ చేసినట్లు తెలిపారు.. ఇక, ఎన్డీయే ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, 2014–19 మధ్య వ్యవసాయ జీఎస్డీపీ 6 శాతం పైగా పెరిగిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో అది తగ్గిపోయిందని విమర్శించారు. మా ప్రభుత్వం రైతులకు ధాన్య డబ్బులు 24 గంటల్లో జమ చేస్తోంది. అన్నదాత సుఖీభవ కోసం రూ.3,000 కోట్లు కేటాయించాం అన్నారు. మొంథా తుఫాన్ ప్రభావాన్ని తగ్గించేందుకు సాంకేతికత సాయం తీసుకున్నామని, ప్రభుత్వ చర్యలతో నష్టం పరిమితమైందని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
