CID Notices to RGV: వదల బొమ్మాళి..! మరో కేసులో ఆర్జీవీకి సీఐడీ నోటీసులు..
- మరో కేసులో దర్శకుడు రాంగోపాల్ వర్మకు నోటీసులు..
- వర్మకి నోటీసు ఇచ్చిన గుంటూరు సీఐడీ సీఐ తిరుమలరావు..
- ఈ నెల 10న సీఐడీ కార్యాలయంలో విచారణకి హాజరు కావాలని నోటీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CID Notices to RGV: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మను కేసులు వదలడం లేదు.. ఓ కేసులో ఈ రోజు ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో ఆర్జీవీని దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించారు పోలీసులు.. అయితే, ఇదే సమయంలో.. మరో కేసులో ఏపీ సీఐడీ పోలీసుల నుంచి నోటీసులు అందుకోవాల్సి వచ్చింది వర్మ.. డైరెక్టర్ రాంగోపాల్ వర్మకి నోటీసు జారీ చేశారు గుంటూరు సీఐడీ సీఐ తిరుమలరావు. ఈ నెల 10వ తేదీన గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకి హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.. 2019లో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా తీశారు ఆర్జీవీ.. అయితే, తమ మనో భావాలు దెబ్బ తీసేవిధంగా సినిమా తీశాడంటూ గత ఏడాది నవంబర్ 29వ తేదీన సీఐడీ కార్యాలయంలో ఫిర్యాదు చేవారు తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ.. ఈ రోజు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో వర్మకి నోటీసు ఇచ్చారు సీఐడీ సీఐ తిరుమలరావు. మరి, ఈ కేసులో విచారణకు ఆర్జీవీ హాజరవుతారా? అనే ఉత్కంఠ నెలకొంది..
Read Also: RGV Police Interrogation: ముగిసిన ఆర్జీవీ విచారణ.. 9 గంటల పాటు ప్రశ్నల వర్షం..!
Also Read
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
- Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
కాగా, పలుమార్లు పోలీసులు నోటీసులు ఇచ్చినా.. విచారణకు డుమ్మా కొడుతూ వచ్చిన ఆర్జీవీ.. హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ సంపాదించారు.. అయితే, విచారణకు సహకరించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అనుగుణంగా.. ఈ రోజు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు.. రాంగోపాల్ వర్మపై దాదాపు 9 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు పోలీసు అధికారులు.. సీఐ శ్రీకాంత్ నేతృత్వంలోని పోలీసుల టీమ్ ఆర్జీవీని విచారించింది.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌తో పాటు నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్ (ట్విట్టర్)లోని తన ఖాతాలో పోస్ట్ చేశారు ఆర్జీవీ.. అయితే, తన ఎక్స్ లో నుండే పోస్టింగ్స్ చేసినట్టు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారట ఆర్జీవీ.. వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆ పోస్టింగ్స్ చేసినట్టు తెలిపారట.. కానీ, ఆ పోస్టింగ్స్ తో వైసీపీ నేతలకు సంబంధం లేదని ఆర్జీవీ సమాధానం ఇచ్చారట.. మరోవైపు ఫైబర్ నెట్ నుండి రెండు కోట్ల రూపాయలు… వైసీపీ నేతలతో ఉన్న సంబంధాలపై కూడా ఆర్జీవీని ప్రశ్నించారు పోలీసులు..
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!