Guillain Barre Syndrome Case Found In Vizag: విశాఖపట్నంలో తాజాగా ఓ అరుదైన వ్యాధి వెలుగు చూసింది. అది.. గులియన్-బారే సిండ్రోమ్. ఈ వ్యాధి ప్రపంచంలో అతి తక్కువ మందిలో కనిపిస్తుంది. రాయగడకి చెందిన ఓ వ్యక్తి ఈ వ్యాధి బారిన పడగా.. ఆయన్ను విశాఖకు తీసుకొచ్చారు. రోగి శరీరంలో కేవలం కళ్లు తప్ప.. ఏ అవయవం కదపలేని స్థితిలో ఉన్నారు. గుండె, నాడీ కూడా 30కి పడిపోయింది. దాదాపు ఆ వ్యక్తి చనిపోవడం ఖాయమని అనుకున్నారు. కానీ.. వైద్యులు ఓటమిని అంగీకరించలేదు. అలాంటి స్థితిలో ఉన్న ఆ రోగిని.. మెరుదైన అందించి కాపాడారు. అయితే.. ఈ ప్రాసెస్ అంత సులువుగా సాగలేదు. ఏకంగా 70 రోజుల పాటు వైద్యం అందించి.. వైద్యులు ఆ రోగిని కాపాడారు.
Manipur Violence: మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించే ఛాన్స్..?
ఇంతకి గులియన్-బారే సిండ్రోమ్ ఏంటి?
ఇది నరాలను ప్రభావితం చేసే అరుదైన వ్యాధి. మనల్ని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచే రోగ నిరోధక వ్యవస్థే.. నరాల మీద దాడి చేసి తిమ్మిరి, బలహీనత, నొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది. ఈ సెన్సేషన్ త్వరగా శరీరం మొత్తం పాకి.. చివరికి పక్షవాతంకు దారి తీస్తుంది. ఈ పరిస్థితికి గల కారణాలేంటో ఇప్పటికీ తెలియదు కానీ.. చాలా మంది రోగులు శ్వాసకోశ లేదా జీర్ణశయాంతర వైరల్ సంక్రమణను గురైనట్టు తెలిపారు.
Titanic Ship: టైటానిక్ షిప్ శిథిలాలు.. చూపించేందుకు తీసుకెళ్లే పర్యాటక జలాంతర్గామి మిస్సింగ్..!
ఈ వ్యాధి రావడానికి గల కారణాలు?
శ్వాసకోశ లేదా జీర్ణశయాంతర వైరల్ సంక్రమణ తర్వాత.. ఈ వ్యాధి రోజులు లేదా వారాల వ్యవధిలో కనిపిస్తుంది. జికా వైరస్ లేదా కోవిడ్-19 ఇన్ఫెక్షన్ వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని తాజా నివేదికల్లో తేలింది. సాధారణంగా.. మన ఆరోగ్యంపై దాడి చేసే వైరస్‌లపై రోగ నిరోధక వ్యవస్థ దాడి చేస్తుంది. కానీ.. ఈ వ్యాధి బారిన పడినప్పుడు మాత్రం ఆ వ్యవస్థ నరాలపై దాడి చేసి.. బలహీనత, పక్షవాతం గురయ్యేలా చేస్తుంది.
Vizag Affair Crime: త్రిల్లర్ సినిమాని తలపించే మిస్టరీ కేసు.. ఆ నాలుగు నంబర్లే హంతకుడ్ని పట్టించాయి
ఈ వ్యాధి లక్షణాలు
ఇది కాళ్ళలో జలదరింపు, బలహీనతతో ప్రారంభమవుతుంది. మెల్లగా శరీరం పై భాగాలకు వ్యాపిస్తుంది. క్రమంగా ఈ వ్యాధి శరీరం మొత్తం వ్యాపించి.. పక్షవాతంగా మారుతుంది.