NTV Telugu Site icon

Gudivada Amarnath: పవన్ కళ్యాణ్‌కి కౌంటర్.. చెప్పులు మా దగ్గర లేవా?

Gudivada Amanarnath On Pk

Gudivada Amanarnath On Pk

Gudivada Amarnath Counter To Pawan Kalyan Comments: చెప్పుతో కొడతానంటూ జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ‘మా దగ్గర చెప్పులు లేవా?’ అంటూ ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. ఫ్రస్ట్రేషన్ ఎక్కువై పవన్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని అన్నారు. ‘చెప్పుతో కొడతాడా? చెప్పులు మా దగ్గర లేవా? పళ్ళు వాళ్ళకు లేవా?’ అంటూ రివర్స్ ఎటాక్ చేశారు. ప్రజాస్వామ్యంలో చెప్పుతో కొట్టడం, పళ్ళు రాలగొట్టడం అంటే.. పవన్ కళ్యాణ్‌కు భీమవరంలో, గాజువాకలో జరగటం లాంటిదని సెటైర్లు వేశారు. మొన్న ఎన్నికల్లో 6 శాతం ఓట్లు వచ్చిన పవన్ దగ్గర చెప్పులు, పళ్ళు ఉంటే.. 50 శాతం ఓట్లు వచ్చిన మా దగ్గర ఎన్ని ఉండాలి? అని ప్రశ్నించారు. మూడు పెళ్ళిళ్ళే పవన్ కళ్యాణ్ విధానమని విమర్శించారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సింహం, పులి అని అనుకున్నారని.. ఇవాళ పిచ్చి కుక్క అని తేలిపోయిందని ఎద్దేవా చేశారు.

పీకే అంటే ప్యాకేజీ కళ్యాణ్, పీకే అంటే పెళ్ళిళ్ళ కళ్యాణ్, పీకే అంటే పిచ్చి కుక్క అని తాను ఇప్పటికీ అంటానని.. ఏం చేస్తాడో రమ్మనండని అమర్నాథ్ సవాల్ విసిరారు. తామంతా సమాజంలో ఉన్నామని, అడవిలో లేమని.. వచ్చి ఎవరిని కొట్టేస్తావ్ అంటూ నిలదీశారు. చిరంజీవి లేకపోతే నువ్వెక్కడ ఉండేవాడివని సూటి ప్రశ్న సంధించారు. టీడీపీకి ఊడిగం చేస్తున్నావని.. రంగా మరణానికి కారణమైన టీడీపీతో ఎలా పొత్తు పెట్టుకున్నావని పవన్‌ని ప్రశ్నించారు. ఒకసారి యుద్ధంలో ప్రజలు ఏం సమాధానం ఇచ్చారో చూశామని.. మళ్లీ యుద్ధానికి రమ్మనండని ఛాలెంజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ ఇంటి అడ్రస్ ఎక్కడో చెప్పమని డిమాండ్ చేశారు. రాష్ట్రం గురించి అవసరం లేదు.. వాళ్ళ పార్టీకి చెందిన ఒక 70 పేర్లు చెప్తే.. పవన్ ఏం చెప్తే అది చేయడానికి సిద్ధమని అన్నారు. ఆడ పిల్లలను గౌరవించే సంస్కారం పవన్‌కి లేదన్నారు. మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న నీకు మూడు వేల స్టెఫినీలు ఉన్నారా? అని ప్రశ్నించారు.

Show comments