Gitam Admissions: గీతం అడ్మిషన్స్ కౌన్సిలింగ్ షురూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూన్ 1 నుంచి గీతం అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రారంభం విలేఖరుల సమావేశంలో వెల్లడించిన గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం తొలి దశ ఆన్లైన్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 1 , 2022 నుంచి ప్రారంభం కానుందని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మంగళవారం హైదరాబాద్ లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.
అఖిల భారత గీతం ప్రవేశ పరీక్ష (గాట్ -2022 )ని దేశవ్యాప్తంగా 83 కేంద్రాలలో మే 20-26న నిర్వహించగా, 25 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారని, 27 వ తేదీన ఫలితాలను వెల్లడించినట్టు తెలిపారు. కౌన్సెలింగ్ లో పాల్గొనాలని అభిలషించే విద్యార్థులు admissions.gitam.edu కు లాగిన్ అవ్వాలని , అక్కడ ప్రవేశ పరీక్ష ఫలితాలతో పాటు స్కాలర్షిప్ వివరాలను కూడా పొందుపరచామన్నారు.
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
గీతం ప్రవేశ పరీక్ష ద్వారా ఇంజనీరింగ్ , ఆర్కిటెక్చర్ , సెన్స్ , ఫార్మసీ , మేనేజ్మెంట్ , లా , హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెనెస్ , పబ్లిక్ పాలసీ , నర్సింగ్ , ఫిజియోథెరపీ , పారామెడికల్ కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తున్నట్టు ప్రొఫెసర్ రావు వివరించారు. గీతం ప్రవేశ పరీక్షలో వచ్చిన స్కోరు లేదా ర్యాంకు ఆధారంగా మెరిట్ స్కాలర్ షిప్ ఇస్తున్నానని , అత్యుత్తమ ప్రతిభా వంతులకు ప్రవేశ రుసుములో పూర్తి రాయితీ ఉంటుందని ఆ తరువాత ర్యాంకులను బట్టి 75 శాతం , 50 , 25 , 15 శాతం రాయితీలను ఇచ్చి ప్రోత్సహిస్తున్నామన్నారు . బీటెక్ లో ప్రవేశం పొందగోరే ఔత్సాహికులకు 2022 లో నిర్వహించే జేఈఈ మెయిన్ , టీఎస్ ఎంసెట్ , ఏపీ ఈఏపీసెట్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా కూడా మొదట వచ్చిన వారికి తొలి ప్రాధాన్యం పద్ధతిపై స్కాలర్ షిప్ లు మంజూరు చేస్తున్నట్టు తెలియజేశారు.
గాట్ -2022 ఫేజ్ -1 లో మొత్తం మూడువేలమంది విద్యార్థులకు స్కాలర్ షిప్ ప్రకటించగా, అందులో 1,410 మంది తెలంగాణ రాష్ట్రం వారని ప్రొఫెసర్ డీ.ఎస్.రావు పేర్కొన్నారు. ఉపకారవేతనం శాతం గాట్ ఆధారంగా స్కాలర్ షిప్ అందిస్తామన్నారు. 2021-21 విద్యా సంవత్సరంలో నిర్వహించిన ప్రాంగణ నియామకాలలో గీతం మూడు ప్రాంగణాల నుంచి దాదాపు 3,950 మంది విద్యార్థులు ఎంపికవగా, అందులో హైదరాబాద్ ప్రాంగణం నుంచి వెయ్యి మంది ఉద్యోగాలు పొందినట్టు ప్రొఫెసర్ రావు వివరించారు.
గీతం లో అత్యుత్తను ప్రమాణాలను ఐటీ , సేవా రంగాలతో పాటు ప్రధాన పరిశ్రమలెన పలు బహుళ జాతి , దేశీయ కంపెనీలు గుర్తించాయని , ఇది ఏడాదికేడాది ఆయా కంపెనీలు మరిన్ని ప్రాంగణ నియామకాలు చేపట్టేందుకు దోహద పడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు . ఈ విలేకరుల సమావేశంలో గీతం రెసిడెంట్ డెరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ సి.ఉదయకుమార్ , హెడ్ – అడ్మిషన్స్ డాక్టర్ కె.శివకుమార్ తదితరులు పాల్గొన్నారు .
తాజావార్తలు
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!