Site icon NTV Telugu

Gidugu Rudraraju: మాది యంగ్ టీమ్‌.. పార్టీ బలోపేతం కోసం పని చేస్తాం

Gidugu Rudraraju

Gidugu Rudraraju

ఈ మధ్యే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి కొత్త టీమ్‌ను ప్రకటించింది ఏఐసీసీ.. గిడుగు రుద్రరాజును కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. అయితే, ఇవాళ.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కలిశారు.. ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్లు.. ఏపీలో పార్టీ బలోపేతం కోసం చేయాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించారు.. ఇక, ఈ సమావేశం ముగిసిన తర్వాత.. మీడియాతో మాట్లాడిన గిడుగు రుద్రరాజు.. మాది యంగ్ టీమ్.. పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేస్తామన్నారు.. టీమ్‌ స్పిరిట్ తో పనిచేస్తామన్నారు.. ఇక, కొత్త వారిని టీమ్‌లో నియమించనున్నట్టు వెల్లడించారు.. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని పార్టీ అధ్యక్షుడు ఖర్గే దిశా నిర్దేశం చేశారని వెల్లడించారు.. మాకు చాలా పెద్ద టాస్క్ ఇచ్చారన్న ఆయన.. నేను అధ్యక్షుడిగా కాకుండా, కో ఆర్డినేటర్ గా పనిచేస్తా .. అందరినీ సమన్వయం చేయడమే నా బాధ్యత అన్నారు పీసీసీ చీఫ్‌ గిడుగు రుద్రరాజు.

Read Also: Lesbian couple photoshoot: లెస్బియన్ జంట వెడ్డింగ్ ఫోటో షూట్.. అసలు మామూలుగా లేరుగా..!

కాగా, ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజును నియమించిన హైకమాండ్.. 18 మందితో పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ, 34 మందితో కో ఆర్డినేషన్‌ కమిటీని నియమించింది.. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా అధ్యక్షుడిగా మస్తాన్ వలి, సుంకర పద్మశ్రీ, జంగా గౌతమ్, రాకేశ్‌రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా మాజీ ఎంపీ హర్షకుమార్‌‌గా ఉంటారు. ఇక కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా మాజీ మంత్రి పల్లం రాజు, మీడియా, సామాజిక మాధ్యమాల కమిటీ చైర్మన్‌ బాధ్యతలను తులసిరెడ్డికి అప్పగించింది. ఈ మేరకు పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే..

Exit mobile version