వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమీక్షంలో.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు మంగళగిరికి చెందిన కీలక నేత గంజి చిరంజీవి.. 20 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పిన చిరంజీవి.. ఇవాళ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డితో కలిసి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.. మరికొందరు ముఖ్యనేతలతో కలిసి సీఎం వైఎస్ జగన్‌తో సమావేశం అయ్యారు.. ఈ సందర్భంగా.. సీఎం సమక్షంలో వైసీపీలో చేరారు.. పార్టీ కండువా కప్పి గంజి చిరంజీవి, ఆయన భార్యను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కాగా, 2014లో టీడీపీ నుంచి మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన గంజి చిరంజీవి.. 2019 ఎన్నికల్లో ఆ స్థానాన్ని నారా లోకేష్ కోసం త్యాగం చేశారు.. స్థానికంగా బీసీ వర్గాల్లో మంచి పట్టు ఉన్న నాయకుడిగా గంజి చిరంజీవికి పేరు ఉండగా.. తాజాగా సైకిల్ దిగిన ఆయన.. ఫ్యాన్ కిందకు చేరారు. చిరంజీవి టీడీపీని వీడడం.. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్‌కి ఎదురుదెబ్బగా చెబుతున్నారు స్థానిక నేతలు.
Read Also: DGP Meets CM YS Jagan: సీఎం జగన్‌తో డీజేపీ సమావేశం.. తాజా పరిస్థితులతో భేటీకి ప్రాధాన్యత