NTV Telugu Site icon

Attack on Women: రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. మహిళ పట్ల అసభ్య ప్రవర్తన, దుస్తులు చించివేసి..!

Ganja

Ganja

Attack on Women: విశాఖపట్నంలో గంజాయి బ్యాచ్‌ రెచ్చిపోయింది.. మద్యం, గంజాయి మత్తులో విచక్షణారహితంగా ప్రవర్తించింది.. అడ్డువచ్చినవారిపై దాడి చేసి భయబ్రాంతులకు గురిచేశారు.. ఓ మహిళపై దాడి చేయమే కాదు.. ఆమె దుస్తులను చింపివేసింది గంజాయి బ్యాచ్.. ఈ ఘటన మొత్తం భాదితురాలి భర్త, సోదరుడు ముందే జరిగింది.. అయితే, ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆ ఇద్దరిపై కూడా దాడికి పాల్పడ్డారు మత్తు బాబులు..

Read Also: Tamil Nadu: జవాన్‌ను కొట్టి చంపిన కౌన్సిలర్.. తమిళనాడులో పొలిటికల్‌ హీట్..

విశాఖపట్నం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మద్యం, గంజాయి మత్తులో విచక్షణారహితంగా ప్రవర్తించింది ఓ గ్యాంగ్‌.. మహిళపై దాడి చేసి దుస్తులు చించివేసింది గంజాయి బ్యాచ్.. స్థానిక రంగిరీజు వీధికి చెందిన ఓ కుటుంబం రాత్రి 9:30 గంటల సమయంలో ఓ ఫంక్షన్‌ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో వారిని అడ్డుకుంది గంజాయి బ్యాచ్.. ఓ మహిళ పట్ల అసభ్యకరమైన రీతిలో ప్రవర్తించారు.. భర్త, సోదరుడి కళ్లు ముందే ఆకతాయిలు ఇష్టంవచ్చినట్టు ప్రవర్తించారు.. ఈ ఘటనను జీర్ణించుకోలేని భర్త, సోదరుడు.. మత్తు బాబులను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వాడిపై కూడా దాడి చేశారు, పిడి గుద్దులతో విరిచుకుపడి తీవ్రంగా గాయపరిచారు.. అయితే, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు.. దీంతో కేసు నమోదు చేసిన వన్‌టౌన్‌ పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.

Show comments