Andhra Pradesh: మరో దారుణం.. యువతిపై గ్యాంగ్ రేప్, హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మతిస్థిమితం లేని యువతిపై గ్యాంగ్‌రేప్ ఘటన మరువక ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో యువతిని సామూహికంగా అత్యాచారం చేసి హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం తుమ్మపూడికి చెందిన వీరంకి తిరుపతమ్మ (35) పొలాలకు నీళ్లు పెట్టే పైపులు అద్దెకిస్తూ బతుకుతోంది. ఆమె భర్త శ్రీనివాసరావు పనుల కోసం తిరుపతి వెళ్లారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఆమె ఇంట్లో మృతిచెంది పడి ఉండటాన్ని గుర్తించారు. తిరుపతమ్మ మృతదేహంపై గోళ్లతో రక్కిన గాయాలు, కొరికిన గాట్లు ఉన్నట్లు గుర్తించారు. దుస్తులు కూడా లేకపోవడంతో సామూహిక అత్యాచారం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది.
కాగా యువతి మృతదేహాన్ని పోలీసులు తెనాలి ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి నిందితులను పోలీసులు గుర్తించారు. తిరుపతమ్మకు తెలిసినవారే హత్యకు పాల్పడి ఉంటారని గుర్తించారు. సంఘటనాస్థలంలో నిందితులు తాగిపడేసిన మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. అత్యాచారానికి పాల్పడి యువతిని హత్య చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం దుగ్గిరాల మండల కమిటీ కార్యదర్శి జెట్టి బాలరాజు, నాయకులు వి.సాంబశివరావు డిమాండ్ చేశారు. హత్యకు ముందు తిరుపతమ్మపట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించినట్లు ఆమె శరీరంపై ఉన్న గాయాలను బట్టి అర్థమవుతోందని, ఇటువంటి వారిని క్షమించకూడదని వారు డిమాండ్ చేశారు. నిందితులకు కఠినశిక్ష పడేలా చేయడం ద్వారా మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
Also Read
- AP Weather Today: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
- Pawan Kalyan: అభిమాని కష్టంలో ఉన్నాడని తెలిసి ఇంటికే వెళ్లిన పవన్ కళ్యాణ్.. కుటుంబానికి భరోసా!
- SBI ATM Robbery: బుక్కరాయసముద్రంలో ఎస్బీఐ ఏటీఎం చోరీ.. నగదు దోచుకుని మిషన్‌ను..!
- Fake Currency Scam: రూపాయి ఇస్తే మూడు రూపాయలు.. నకిలీ నోట్ల ఆశతో 14 లక్షలు పోగొట్టుకున్న అన్నదమ్ములు!
Vishaka: ఆస్పత్రిలో దారుణం.. మైనర్ బాలికపై డాక్టర్ వెకిలి చేష్టలు
- Tags
- Crime News
- gang rape
- Guntur
- murder
తాజావార్తలు
-
AP Weather Today: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
-
CM Revanth Reddy: భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.. విద్యతోనే సమాజ మార్పు సాధ్యం.!
-
Vivo T5 Lite 5G: వివో T5 Lite 5G త్వరలో భారత్‌లోకి.. 6,500mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Pawan Kalyan: అభిమాని కష్టంలో ఉన్నాడని తెలిసి ఇంటికే వెళ్లిన పవన్ కళ్యాణ్.. కుటుంబానికి భరోసా!
-
Obsession : ఇండియాలో అబ్సెషన్ కలెక్షన్ల సునామీ… కన్జ్యూరింగ్ రికార్డ్స్ బ్రేక్
ట్రెండింగ్
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్‌కు పండగే.. 12 గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?