NTV Telugu Site icon

Fraud Lady: ఆమె వయసు 54.. ఖర్చుల కోసం మూడు పెళ్లిళ్ళు

Fraud Lady

Fraud Lady

అమ్మాయిలు అందంగా క‌నిపించాలంటే మేక‌ప్ చాలా అవ‌స‌రం అంటుంటారు. కానీ ఆ అందం చూసి మోస‌పోతుంటారు అబ్బాయిలు. తెర‌వెన వున్న వాటిని వ‌దిలి మేక‌ప్ వేసుకుని అందంగా వున్న అమ్మాయిల‌కు ఆక‌ర్ష‌తుల‌వుతుంటారు. మ‌న‌సును కాకుండా.. మేక‌ప్ వైపు ప‌రుగులు పెడ‌తారు. ఆ మేక‌ప్ అందాన్నే కాదు వ‌య‌స్సును కూడా దాచేస్తుంద‌ని భ్ర‌మ‌లోవుంటారు. అంటే నిజాన్ని కాకుండా అప‌ద్దాన్నే న‌మ్మే లోకంలో బ‌తుకుతున్నామ‌నే చెప్పాలి. అంటే.. మోసం చేయ‌డంలో మోస‌పోవ‌డంలో అమ్మాయిలు, అబ్చాయిలు ఒక‌రిని మించిన ఒక‌ర‌నే చెప్పాలి. అయితే ఇలాంటి ఓ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. మోసం చేయడంలో ఆరితేరిపోయింది ఓ యాభైఏళ్ళ అవ్వ. మ‌గాళ్ల‌ను నిలువునా ముంచింది. త‌న వ‌య‌స్సును క‌నిపించ‌కుండా మేక‌ప్ తో క‌వ‌ర్ చేసి, మూడు పేర్లు మార్చి మూడు పెళ్ళిల్లు చేసుకుంది ఈ కిలాడీ అవ్వ. ఈ ఘ‌ట‌న తిరువ‌ళ్ళూరులో చోటుచేసుకుంది.

read also: PM Modi: దివ్యాంగ బాలుడి మాటలు విని ముచ్చటపడిన ప్రధాని మోదీ

తిరుప‌తికి చెందిన శాంతమ్మ త‌న కూతురు శ‌ణ‌ర్య (సుగుణ, సంధ్య) తో క‌లిసి నివాసం వుంటోంది. అయితే కూతురు శ‌ణ‌ర్య డ‌బ్బుల కోసం పెళ్ళిళ్లు చేసుకునేందుకు సిద్ద‌ప‌డింది. త‌న వ‌య‌స్సు యాభై ఏళ్లు అయినా అది క‌వ‌ర్ చేసేందుకు మేక‌ప్ తో క‌వ‌ర్ చేసి డ‌బ్బుకోసం కొన్నేళ్ళ క్రితం పుత్తూరు చెందిన రవితో వివాహం చేసుకుంది. ఆ తరువాత సుబ్రమణితో పెళ్ళికి సిద్ద‌మైంది. అయితే వీరిద్దరు నుండి భారీగా నగలు,నగదు దోచుకున్నారు కూతురు శ‌ణ‌ర్య‌, త‌ల్లి శాంత‌మ్మ.

అయితే క‌రోనా కార‌ణంగా డబ్బుల‌న్నీ ఖ‌ర్చు అయిపోయాయి. త‌ల్లీ, కూతుర్లు ఇద్ద‌రు మ‌రో ప్లాన్ వేశారు. తాజాగా తిరువళ్ళూరు కు చెందిన గణేశ్ కు శ‌ణ‌ర్య పెళ్ళి చేసుకునేందుకు సిద్ద‌మైంది. అయితే త‌న వ‌య‌స్సు 50 కావ‌డంతో.. అది క‌వ‌ర్ చేసేందుకు రెండో భ‌ర్త ఇచ్చిన 25 శవరాల బంగారంతో మేకప్ వేసుకుని బోల్తా కొట్టించింది. ఆరు నెల‌లుగా ఆస్తి కోసం గ‌ణేశ్‌కు శ‌ణ‌ర్య వేధింపులు గురిచేసింది. దీంతో విసిగిపోయిన గ‌ణేశ్ రిజిస్ట్రేష‌న్ కోసం ఆధార్ కార్డ్ అడ‌గ‌టంతో.. శ‌ణ‌ర్య వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డింది. అవాక్క‌యిన గ‌ణేశ్ అవడీ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కిలాడీ లేడీల‌ను అదుపులో తీసుకున్నారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

 

Show comments