NTV Telugu Site icon

Fraud: కేటుగాడి సబ్‌ కలెక్టర్‌ అవతారం.. లక్షలు ముంచేశాడు..!

Fraud

Fraud

కొన్ని మోసాలు చూస్తుంటే.. ఎవరు అసలు..? ఎవరు నకిలీ ? అనేది కూడా అర్థం చేసుకోవడం కష్టంగా మారుతోంది.. తాజాగా, ఓ వ్యక్తి కృష్ణాజిల్లా గన్నవరంలో సబ్ కలెక్టర్ అవతారమెత్తాడు.. అందినకాడికి దోచుకున్నాడు.. సబ్ కలెక్టర్ అవతారంలో అమాయక ప్రజల నుండి లక్షలు దండుకున్నాడు కేటుగాడు.. ఇలా అనేక మంది దగ్గర సుమారు 70 నుండి 80 లక్షల రూపాయల వరకు వసూలు చేశాడు ఫేక్‌ సబ్‌ కలెక్టర్‌ పిల్లా వెంకట రాజేంద్ర.. అయితే, కొంతకాలానికి మేం మోసపోయామని గ్రహించారు బాధితుల్లో కొంతమంది.. దీంతో, పక్కా ప్రణాళికతో గన్నవరం పిలిపించి మోసగాడిని పట్టుకున్నారు మహిళలు.. రాజేంద్రను డబ్బులు విషయం గురించి నిలదీశారు.. దీంతో, తన అసలు రూపాన్ని బయటపెట్టారు.. మీరు కేసు పెట్టి నన్నేమి చేయగలరు? అంటూ ఎదురు ప్రశ్నించడంతో.. అంతా షాక్‌కు గురయ్యారు.

Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

ఇక, నాకు పోలీస్ అధికారులు, డీఎస్పీలు9, సీఐలు, ఎస్‌ఐలు.. ఇలా చాలా మంది పోలీసులు తెలుసు.. రెండు లక్షలు ఇచ్చి వెంటనే బయటకు వస్తాను అంటూ రివర్స్‌లో బాధితులను బెదిరించాడు ఫేక్‌ సబ్‌ కలెక్టర్‌ రాజేంద్ర.. అయితే, ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీకి స్పందనలో ఫిర్యాదు చేసినా కూడా ఈ కేటుగాడు పోలీసులకు చిక్కలేదు.. రాజేంద్రపై గతంలో 10 నుండి 14 కేసులు నమోదు అయినట్టు తెలుస్తుండగా.. రాజేంద్ర ఫోన్ లో ఎక్కువ శాతం పోలీస్ అధికారుల ఫోన్‌ నంబర్లే ఉన్నట్టుగా చెబుతున్నారు.. విలాసాలు, క్యాసినోకు అలవాటు పడిన రాజేంద్ర.. నకిలీ ఐడీ కార్డులను సృష్టించి మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు.

Show comments