Site icon NTV Telugu

Physical harassment: బెజవాడలో దారుణం.. మహిళను నిర్బంధించి 4 రోజులుగా సామూహిక అత్యాచారం

Physical Harassment

Physical Harassment

మహిళను గదిలో నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన విజయవాడలో సంచలనంగా మారింది.. బెంజ్ సర్కిల్ ప్రాంతంలో కూలీ పనులు చేసుకునే మహిళకు మాయమాటలు చెప్పి కానూరు తీసుకెళ్లిన నలుగురు దుండగులు.. కానూరు సమీపంలోని ఓ గదిలో నిర్బంధించారు.. ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం సృష్టిస్తోంది.. నలుగురు దుండగులు.. నాలుగు రోజుల పాటు మహిళలను చిత్రహింసలకు గురిచేస్తూ.. సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.. మహిళకు మద్యం తాగించి తమ లైంగిక వాంచలు తీర్చుకున్నారు..

Read Also: Shalini Kidnap Case: సినీ ఫక్కీలో యువతి కిడ్నాప్.. పూజ చేసి బయటకు వస్తుండగా..

ఇక, అంతటితో ఆగని దుర్మార్గులు ఆ మహిళను చిత్రహింసలకు గురిచేశారు.. బాధితురాలి శరీరబాగాలపై సిగరెట్లతో కాల్చారు కిరాతకులు.. అయితే, స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది.. ఈ ఘటనలో ఇప్పటికే నాగరాజు, శ్రీను అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పెనమలూరు పోలీసులు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.. ప్రస్తుతం మహిళకు విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు.. అయితే, ఇప్పటి వరకు మద్యం మత్తు నుంచి కోలుకోలేని పరిస్థితిలోనే ఉంది ఆ మహిళ.. కానీ, మహిళలను కిడ్నాప్‌ చేసి.. నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడడం.. చిత్రహింసలకు గురిచేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.. కొత్త చట్టాలు వస్తున్నా.. దోషులకు కఠిన శిక్షలు పడుతున్నా.. వరుసగా ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. చిన్నారులు, బాలికలు, యువతులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా.. అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉండడం ఆందోళన కలిగించే విషయం.

Exit mobile version