NTV Telugu Site icon

Margani Bharat: ముఖ్యమంత్రుల భేటీలో ఏ ఒక్క ప్రధాన అంశానికి పరిష్కారం లభించలేదు..

Barath

Barath

Margani Bharat: రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయిక ఆహ్వానించ దగ్గ పరిణామం అన్నారు. ఏ ఒక్క ప్రధాన అంశానికి పరిష్కారం లభించలేదు.. నదీ జలాలకు సంబంధించి ఇప్పటికే కమిటీలు ఉన్నాయి ఇంకా కొత్త కమిటీలు దేనికి.. షీలా బిడే కమిటీని ఎందుకు మర్చిపోయారు.. ఏపీ రీ-ఆర్గనైజేషన్ చట్టం ప్రకారం 10 సంవత్సరాలు మాత్రమే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వర్తిస్తుంది.. మరో పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి కాపిటల్ గా పొడిగించాలి.. టీడీపీ ఎంపీలు ఎవరు ఈ భేటీ గురించి మాట్లాడలేదు అని మాజీ ఎంపీ అన్నారు. ఇక, భద్రాచలం చుట్టూ ఉన్న ఐదు గ్రామాలు ప్రధాన పోర్టుల్లో భాగస్వామ్యం కావాలని తెలంగాణ నేతలు అడిగినట్లు తెలుస్తోంది.. వీటిపై పూర్తిస్థాయిలో రెండు రాష్ట్రాల నేతలు వివరణ ఇవ్వాలి అని మార్గాని భరత్ డిమాండ్ చేశారు.

Read Also: Leopard Roaming In Mahanandi : చిరుత దెబ్బకి కంటికి కునుకు లేకుండా జాగారణ చేస్తున్న జనం..

ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన లవిద్యుత్ బకాయిల గురించి ఏమాత్రం చర్చ జరగనట్టే తెలుస్తోంది అని మాజీ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భారత్ ఆరోపించారు. కేంద్ర పెద్దల మధ్యవర్తిత్వం లేకుండా జరిగిన ఈ సమావేశానికి ఎంత మేర గుర్తింపు ఉంటుంది.. టీడీపీ నేతలు గుట్టల కొద్దీ తీసుకున్న ఇసుకను అక్రమంగా అమ్ముకున్నారు.. రాజ్యాంగం మీద ఒట్టేసి ఎన్ని గుట్టల ఇసుక అమ్ముకున్నారో రాజమండ్రి ఎమ్మెల్యే చెప్పాలి అని డిమాండ్ చేశారు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాటలు గౌరవంగా మాట్లాడాల్సి ఉంటుంది.. నా వాహనం దగ్ధానికి సంబంధించి నీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టు.. నిన్ను నువ్వు ఆధికంగా ఊహించుకోకు.. పవన్ కళ్యాణ్ చరిష్మాతో గెలుచావు.. నీ బఫూన్ ఫేస్ చూసి ఎవరు ఓటు వేయలేదు అని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: MS Dhoni Hairstyle: ప్రపంచం మెచ్చిన హెయిర్ స్టైల్‌ను ఆమె కోసమే కట్ చేయించాడు!

అయితే, నువ్వు ఎవరో రాజమండ్రికి పెద్దగా తెలియదు అని మార్గాని భరత్ చెప్పుకొచ్చారు. నువ్వు పెట్టిన లైవ్ 12 వేల మంది చూస్తే.. నేను పెట్టిన లైవ్ ఐదు లక్షల మంది చూశారు.. అది నీ రేంజ్, ఇది నా రేంజ్ అని విమర్శించారు. ఇప్పటి వరకు ప్రభుత్వ పథకం ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో ఇంప్లిమెంట్ కాలేదు.. అద్భుతంగా డెవలప్ చేసిన కంబాల చెరువును నాశనం చేశారు.. నా ఎంపీ నిధులతో ఎన్నో అద్భుతమైన అభివృద్ధి పనులు చేపట్టాను.. కనీసం వాటి కొనసాగింపైనా పూర్తిస్థాయిలో జరిగే విధంగా చూసుకో అని మార్గాని భరత్ వెల్లడించారు.