Margani Bharat: రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయిక ఆహ్వానించ దగ్గ పరిణామం అన్నారు. ఏ ఒక్క ప్రధాన అంశానికి పరిష్కారం లభించలేదు.. నదీ జలాలకు సంబంధించి ఇప్పటికే కమిటీలు ఉన్నాయి ఇంకా కొత్త కమిటీలు దేనికి.. షీలా బిడే కమిటీని ఎందుకు మర్చిపోయారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో అధికారులతో భేటీ ముగిసింది. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించాల్సిన అంశాలపై చర్చించారు. ఏపీ, తెలంగాణ విభజన అంశాలపై చర్చించాల్సిన అంశాలను సీఎం చంద్రబాబు సిద్ధం చేసుకున్నారు. సాయంత్రం 5:30 గంటల తరువాత సీఎం చంద్రబాబు ప్రజాభవన్ బయలుదేరనున్నారు. అనంతరం.. షెడ్యూల్ 9, 10 లో ఉన్న ప్రభుత్వ సంస్థల ఆస్తుల పై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తుల తాకిడి పెరుగుతోంది. కరోనా నుంచి దేశం కోలుకుంటోంది. దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చేవారు పెరుగుతున్నారు. కొండపై వీఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల తాకిడి కూడా ఎక్కువగానే వుంది. నవంబర్ 13,14,15వ తేదీలలో శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. 14వ తేదీన తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా వస్తున్నారు. వీఐపీల తాకిడి కారణంగా బ్రేక్ దర్శనాలు, సిఫార్సు…