Site icon NTV Telugu

Anil Kumar Yadav: పవన్‌ కల్యాణ్‌కు మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ సీరియస్‌ వార్నింగ్..

Anil Kumar Yadav

Anil Kumar Yadav

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్… రేణిగుంట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి దిగజారుడు మాటలు తగవు అంటూ పవన్‌ కల్యాణ్‌కు హితవు పలికారు.. ఇక, రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని చూసి నేర్చుకోవాలని సూచించిన ఆయన… అలాగే ఓ రాజకీయ నేత ఎలా ఉండకూడదో పవన్ కల్యాణ్‌ని చూసి నేర్చుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. ఆరు పర్సెంట్ ఓట్లు ఉన్న నువ్వే అలా మాట్లాడితే… 50 శాతం ఓట్లు ఉన్న మేము ఎలా మాట్లాడాలని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. తెలుగుదేశాన్ని, జనసేనని 2024లో బంగాళాఖాతంలో కలపటం ఖాయమంటూ జోస్యం చెప్పారు… ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు అంటూ పవన్‌ కల్యాణ్‌ను హెచ్చరించారు అనిల్‌ కుమార్‌ యాదవ్.

Read Also: Rupee Drops : రూపాయి కొత్త చరిత్ర.. 83 కూడా దాటేసింది..

ఇక, ప్రభుత్వంపై పవన్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంగళవారం కౌంటర్‌ ఎటాక్‌ చేశారు అనిల్‌ యాదవ్.. ఈ ప్రభుత్వాన్ని పీకేసే సత్తా ఉందో లేదో పీకే తెలుసుకోవాలన్నారు. పవన్ చంద్రబాబు దత్తపుత్రుడివని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని.. అందరూ కలిసి కట్టకట్టుకుని వచ్చినా 2024లో వైఎస్సార్‌సీపీదే విజయం అని ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.. 2024 ఎన్నికలలో విజయం సాధించి ప్రతిపక్షమే లేకుండా చేస్తామన్నారు. సినిమాలతో పాటు చంద్రబాబు స్క్రిప్ట్‌లకు కూడా నటించే పవన్‌ను జనం నమ్మరని… ముందు జనసేనాని పోటీ చేసే సీటు గెలిచేందుకు ప్రయత్నించాలని ఎద్దేవా చేశారు. అభిమానులు పవన్ కళ్యాణ్ వెంట తిరగడం మానుకోవాలని.. ఆయన సీఎం అవ్వడం ఓ కలగానే మిగిలిపోతుంది అంటూ మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ జోస్యం చెప్పిన విషయం తెలిసిందే.

Exit mobile version