NTV Telugu Site icon

First GBS Death In AP: ఏపీలో తొలి జీబీఎస్ మరణం.. ఏపీ సర్కార్ అలర్ట్

Gbs

Gbs

First GBS Death In AP: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తొలి జీబీఎస్ మరణం సంభవించింది. ప్రకాశం జిల్లాలోని కొమరఓలు మండలం అలసందలపల్లి గ్రామానికి చెందిన కమలమ్మ అనే మహిళ గులియన్ బారే సిండ్రోమ్ వ్యాదితో చికిత్స సోకడంతో గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ.. కొద్దిసేపటి క్రితం మృతి చెందింది. అయితే, రెండు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో పాటు కాల్లు చచ్చు బడిపోయి గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ లో చేరింది కమలమ్మ.. రెండు రోజుల నుంచి వెంటిలేటర్ పై మృత్యువుతో పోరాడుతూ ఈ రోజు తుది శ్వాస విడిచింది. హాస్పిటల్ లో వైద్యం అందించిన, ఫలితం లేకుండా పోయింది.

Read Also: SRH Full Schedule: సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్ ఇదే.. తొలి మ్యాచ్ ఏ జట్టుతో అంటే..?

అయితే, వ్యాధి లక్షణాలు కనిపించడంతో ఈ నెల 3వ తేదీన గుంటూరు జీజీహెచ్ కు కమలమ్మను తీసుకెళ్లగా టెస్టులు చేసిన వైద్యులు ఆమెకు జీబీఎస్ వైరస్ సోకినట్లు నిర్ధారించారు. దీంతో ఆ తర్వాత చికిత్స అందించినప్పటికీ.. కొంచెం తగ్గినట్లు కనిపించినప్పటికీ.. గత రెండు రోజుల క్రితం వ్యాధి తీవ్రత పెరగడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వెంటిలేటర్ పై చికిత్స అందించినప్పటికీ. చివరకు మరణించింది. ఇక, ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. ప్రమాదకరమైన అంటు వ్యాధి కాకపోయినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో మరణాలు సంభవిస్తాయని తెలిపారు. ఈ వ్యాధి ఎందుకు సోగుతుందో ఎవరికీ తెలియడం లేదని వైద్యులు పేర్కొంటున్నారు.